E-Paper
Advertisement

ఈ జన్మలో రాహుల్ గాంధీ ప్రధాని కాలేడు.. రాసిపెట్టుకోండి- కిషన్ రెడ్డి

ఈ జన్మలో రాహుల్ గాంధీ ప్రధాని కాలేడు.. రాసిపెట్టుకోండి- కిషన్ రెడ్డి
Advertisement

Kishan Reddy: స్వేచ్ఛ బ్యూరో: ముఖ్​యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. తనను పొలిమేర దాటకుండా ఆపేవాడు ఇంకా ఎవడూ పుట్టలేదని వ్యాఖ్యానించారు. నాంపల్లి బీజేపీ రాష్​ట్ర కార్యాలయంలో ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ లా తాను పార్టీలు మారిన వ్యక్తిని కాదన్నారు. తనకు రేవంత్ సర్టిఫికెట్ అవసరం లేదన్నారు. రేవంత్ కు ముందుంది మొసళ్ల పండుగ అని కేంద్ర మంత్రి హెచ్చరించారు.

రేవంత్.. ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోయే వ్యక్తిని తాను కాదన్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడేందుకు తానేం కేసీఆర్ ను కాదన్నారు. బీజేపీ కార్యకర్తలు ఎవరికి భయపడరని, ఎవరికీ తలవంచారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ జన్మలో రాహుల్ గాంధీ ప్రధాని అవ్వలేడని, కావాలంటే తన వ్యాఖ్యలను రాసి పెట్టుకోవాలని కిఖషన్ రెడ్డి సవాల్ విసిరారు. రేవంత్ కు ఎంతో కాలం లేదని, ఇంకో రెండున్నరేండ్లు మాత్రమే ఉందన్నారు. తన ఇంటి ఎదుట వచ్చి ధర్నా చేస్తానంటే తాను భయపడనని, దళితులు, బీసీలు సీఎం ఇంటి ఎదుట ధర్నాలు చేస్తారని వ్యాఖ్యానించారు.

Advertisement

తాను దేనికైనా నేను సిద్ధమని వ్యాఖ్యానించారు. రాజకీయ పరమైన నిరాశ నిస్పృహలో సీఎం ఉన్నారని వ్యాఖ్యానించారు. సీఎం మాటలు కొండలు, కోనలు దాటుతున్నాయని, ఇచ్చిన హామీలు సెక్రటేరియేట్ దాటడం లేదని చురకలంటించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మోడీ వెస్ట్ బెంగాల్ లో పాల్గొంటారని కిషన్ రెడ్డి తెలిపారు. ఈనెల 20న ఉదయం 5 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఒక్కరోజు కౌంట్ డౌన్ పేరుతో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి అందరూ తరలిరావాలని కోరారు.

Also Read: కూకట్‌పల్లి ‘కింగ్స్ అండ్ క్వీన్స్’ పబ్‌పై డీసీపీ స్పై ఆపరేషన్.. 9 మంది అరెస్ట్!

Related News

RTO Brokers: ఆర్టీఏలో ఏజెంట్ల రాజ్యానికి ఎండ్ కార్డ్?.. యాక్షన్‌లో అధికారులు!

Etela Rajender: రోడ్లెక్కి ధర్నాలా? రాహుల్, ప్రియాంకలపై ఎంపీ ఈటల సంచలన వ్యాఖ్యలు!

Karimnagar Robbery: కరీంనగర్ దోపిడీ ముఠా ప్లాన్ అట్టర్ ఫ్లాప్?.. చివరిలో సినిమా రేంజ్ లాంటి ట్విస్ట్..!

BJP Attack: రాహుల్ తీరుపై బీజేపీ ఫైర్.. ‘దేశ సమగ్రతను దెబ్బతీస్తే తీహార్ జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే!’

Engineering Student: నా అవయవాలను దానం చేయండి అంటూ.. బీటెక్ విద్యార్ధి సూసైడ్ కలకలం!

KTR: ఆదిలాబాద్ CCI పునరుద్ధరణపై స్పష్టత ఇవ్వండి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ!

Jurala Project: జూరాల ప్రాజెక్టు పోటెత్తిన వరద.. త్వరలో గేట్లు ఎత్తే అవకాశం!

Kiran Kumar Reddy: నీట్ స్కామ్‌పై కేంద్రానికి కాంగ్రెస్ డెడ్‌లైన్.. భువనగిరి ఎంపీ చామల సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×