Konda Murali: తన బిడ్డ కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలకు, తమకు సంబంధం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి స్పష్టం చేశారు. బుధవారం ఆయన హైదరాబాద్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. సుష్మితకు 38 సంవత్సరాలని, ఆమెకు 15 ఏళ్ల బిడ్డ, కొడుకు ఉన్నారని వివరించారు. ఆమె అభిప్రాయాలు ఆమెకు ఉన్నాయని, ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్నారు.
ఆ అంశంపై ఇప్పటికే పీసీసీ, క్రమ శిక్షణ కమిటీకి చెప్పాల్సినంతా చెప్పామని, ఏం నిర్ణయం తీసుకుంటారో తమకు తెలియదన్నారు. తమకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై పూర్తి స్థాయిలో నమ్మకం ఉందన్నారు. తాము కాంగ్రెస్ లోనే ఉంటామని, పార్టీని వీడే ప్రసక్తే లేదని కొండా మురళీ నొక్కి చెప్పారు.
Also Read: పౌర సేవలకే కాకుండా.. ఆదాయ మార్గంగా ‘మీ సేవా’.. మెటాతో తెలంగాణ కీలక ఒప్పందం
మరోవైపు తాను రాజగోపాల్ రెడ్డితో ఎలాంటి చర్చలు జరపలేదని కొండా మురళి స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎంను కలిసేందుకు వెళ్లగా, ఆయన అక్కడ ఉన్నారని వివరించారు. మరోవైపు తాను కూడా కూతురు విషయమై ప్రత్యేకంగా రాలేదని ఓ బిల్లు గురించి మాట్లాడేందుకు వచ్చినట్లు మురళి చెప్పుకొచ్చారు.
Also Read: నేపాల్లో అకస్మిక వరదలు.. 16 మంది మృతి.. 105 మంది భారతీయులు గల్లంతు!