E-Paper
Advertisement

ఈనెల 30న తెలంగాణకు సునీల్ బన్సల్.. ఆ అంశాలపై కీలక చర్చ!

ఈనెల 30న తెలంగాణకు సునీల్ బన్సల్.. ఆ అంశాలపై కీలక చర్చ!
Advertisement

Telangana BJP: తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌ ఈనెల 30న రాష్ట్రానికి రానున్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నేతలతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో పార్టీ పనితీరు, సంస్థాగత అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలతో చర్చించనున్నారు. ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ ప్రస్థానానికి 25 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లే కార్యక్రమాలపైనా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.

నెల రోజుల పాటు..

మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా 12.5 ఏళ్లు, ప్రధానమంత్రిగా 12.5 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని కలుపుకుని మొత్తం 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని వివరించేలా ప్రచార కార్యక్రమాలను రూపొందించడంపై పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. సేవా సంకల్ప మహోత్సవ్‌ పేరుతో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మోడీ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, పాలన, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను వివరించే ఫొటో, డిజిటల్‌ ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేయనున్నారు. సుపరిపాలన, అభివృద్ధి, అంత్యోదయ అంశాలపై సదస్సులు, మేధావుల సమావేశాలు నిర్వహించడంతో పాటు యువత, సమాజంలోని వివిధ వర్గాలతో ముఖాముఖి కార్యక్రమాలు చేపట్టనున్నారు.

Advertisement

Also Read: బుమ్రా, షాహిన్ అఫ్రిది ఇద్ద‌రూ రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే !

సంక్షేమ పథకాలు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, వాటి ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిబిరాలను నిర్వహించాలని బీజేపీ యోచిస్తోంది. ముఖ్యంగా అట్టడుగు వర్గాల అభ్యున్నతిని లక్ష్యంగా చేసుకున్న అంత్యోదయ భావనపై కూడా సమావేశాలు, చర్చలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువ కావడంతో పాటు మోడీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని వివిధ కార్యక్రమాల రూపంలో ప్రజలకు వివరించేందుకు పార్టీ ప్రణాళిక రూపొందిస్తోంది. అదేవిధంగా వచ్చే నెల 17న నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాల నిర్వహణపైనా సునీల్‌ బన్సల్‌ రాష్ట్ర నేతలతో చర్చించనున్నారు.

బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌..

Advertisement

పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల రూపకల్పన, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే విధానంపై సమీక్షించే అవకాశం ఉంది. రైతు సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకుని బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ వచ్చే నెలలో చేపట్టనున్న యాత్రపైనా సమావేశంలో చర్చ జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. యాత్ర నిర్వహణకు సంబంధించిన తేదీలను ఖరారు చేయడం, రైతుల సమస్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణపై కూడా పార్టీ నాయకత్వం దృష్టి సారించనుంది. మొత్తంగా సునీల్‌ బన్సల్‌ పర్యటన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ భవిష్యత్‌ కార్యాచరణ, ప్రజా సమస్యలపై పోరాటాలు, పార్టీ కార్యక్రమాల విస్తరణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Also read: మార్చి 31 నాటికి ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేసుకున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్!

Tags

Related News

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

మా సంకల్ప అదే.. యువతతోపాటు మహిళలను ప్రోత్సహించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి

సరైన అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్సీ టికెట్లపై బీజేపీ కసరత్తు

ప్రభుత్వ లెక్చరర్ల బాగోతంపై విద్యాశాఖలో ప్రకంపనలు.. మండిపడుతున్న ప్రజలు, చర్యలు తీసుకోవాలని డిమాండ్

ప్రైవేట్ డాక్టర్ల జీతం రూ. 25 వేలు.. ప్రభుత్వ మెడికోల స్టైఫండ్ ఎంతంటే? షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×