E-Paper
Advertisement

మార్చి 31 నాటికి ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేసుకున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్!

మార్చి 31 నాటికి ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేసుకున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్!
Advertisement

Indiramma Houses: గ్రామీణ ప్రాంతాలలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం ఏడాదిగా ఎదురుచూశామని, పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి విడుదల కాలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడంలో కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా.. తెలంగాణ ప్రజా ప్రభుత్వం వెనక్కి తగ్గదని ఆయన వివరించారు.

2014-23 వరకు..

తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా 2014-23 వరకు దాదాపు ప‌ది సంవ‌త్స‌రాల‌లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పేద‌ల ఇండ్ల నిర్మాణం జ‌ర‌గలేదన్నారు. దీంతో ఇండ్ల నిర్మాణానికి ప్ర‌జ‌ల నుంచి భారీ ఎత్తున డిమాండ్ ఉన్నదన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి అవ‌స‌ర‌మైన ఇండ్ల‌ను మంజూరు చేయాల‌ని అనేకమార్లు విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ…కేంద్రం నుంచి నిధులు వస్తాయన్న నమ్మకంతో ఇప్పటివరకు పూర్తయిన ఇళ్లకు సంబంధించిన చివరి బిల్లుల చెల్లింపును తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందన్నారు.

Advertisement

Also Read: FM రేడియోకు ఏమైంది? స్మార్ట్‌ఫోన్ల నుంచి ఈ ఫీచర్ ఎందుకు మాయమైంది?

మార్చి 31వ తేదీ వరకు..

సీఎం కూడా పలుమార్లుకేంద్రానికి రిక్వెస్ట్ చేసినా, నిధులు రాలేదన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకున్న 15,475 మంది లబ్ధిదారులకు రూ.185 కోట్లను ర విడుదల చేసిందని మంత్రి వెల్లడించారు. మార్చి 31వ తేదీ వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు చివరి బిల్లుల మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో గురువారం జమ అవుతాయని తెలిపారు. మిగిలిన వారికి కూడా విడతల వారీగా ఇస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Advertisement

Also read: పగలంతా పాటలు – రాత్రంతా ఆటలు..ఫోక్ సింగర్ కామెంట్స్ వైరల్

Tags

Related News

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

మా సంకల్ప అదే.. యువతతోపాటు మహిళలను ప్రోత్సహించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి

సరైన అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్సీ టికెట్లపై బీజేపీ కసరత్తు

ప్రభుత్వ లెక్చరర్ల బాగోతంపై విద్యాశాఖలో ప్రకంపనలు.. మండిపడుతున్న ప్రజలు, చర్యలు తీసుకోవాలని డిమాండ్

ప్రైవేట్ డాక్టర్ల జీతం రూ. 25 వేలు.. ప్రభుత్వ మెడికోల స్టైఫండ్ ఎంతంటే? షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×