Panchayat Funds: స్వేచ్ఛ బ్యూరో: నిధులు కనబడితే చాలు.. తీర్మానం అక్కర్లేదు, బిల్లుతో పనే లేదు! సర్పంచ్‌లు మారినా, స్పెషల్ ఆఫీసర్లు మారినా పంచాయతీ నిధులను ‘నమిలేసే’ నైజం మాత్రం మారలేదు. గట్టు గ్రామపంచాయతి లో ఏకంగా రూ.22 లక్షల ప్రజాధనం పక్కదారి పట్టిన వ్యవహారంపై డీఎల్పీఓ, ఎంపీఓలు రంగంలోకి దిగడంతో అవినీతి తిమింగలాల గుండెల్లో రైళ్లు పరిగెడుతు న్నాయి. ఎవరికి వారే యథాశక్తి ‘చేతివాటం’! అధికారుల విచారణలో వెలుగుచూసిన అక్రమాల చిట్టా చూస్తే పంచాయతీ ఖజానాను ఎంత దారుణంగా దోపిడీ చేశారో అర్థమవుతోంది.
గత సర్పంచ్ హయాంలోనే అక్రమాలకు గండిపడింది. కనీస లెక్కాపత్రం లేకుండా ఏకంగా రూ.7.90 లక్షలు గుటుక్కుమనిపించారు. కార్యదర్శుల కక్కూర్తి పాలకవర్గం లేని స్పెషల్ ఆఫీసర్ పాలనలో ముగ్గురు కార్యదర్శులు చేతులు కలిపి రూ.7 లక్షల నిధులను నిలువునా ఊడ్చేశారు. కొత్త పాలకవర్గం దోపిడీ మేము మాత్రం తక్కువ తిన్నామా అన్నట్లు బాధ్యతలు చేపట్టిన ఎనిమిది నెలల్లోనే ప్రస్తుత సర్పంచ్ రూ.5 లక్షలు డ్రా చేసి రికార్డులను పాతరేశారు.
Also Read: పౌర సేవలకే కాకుండా.. ఆదాయ మార్గంగా ‘మీ సేవా’.. మెటాతో తెలంగాణ కీలక ఒప్పందం
ప్రమాణస్వీ కారానికి ‘జలసా’ చివరకు ప్రమాణస్వీకారం పేరుతోనూ ప్రజాధనం నుంచి రూ.90 వేలు దండుకోవడం వీరి తెంపరితనానికి పరాకాష్ట! గ్రామసభలకు మంగళం రికార్డులు మాయం! ఎనిమిది నెలల్లో కనీసం ఒక్కటంటే ఒక్క గ్రామసభతో మమ అనిపించి, నిధుల వినియోగాన్ని ప్రజల నుంచి పూర్తిగా దాచిపెట్టారు. విచారణలో అధికారులు రికార్డులు, తీర్మానాలు చూపాలని నిలదీస్తే బాధ్యుల వద్ద సమాధానం కరువైంది. బాధ్యులపై వేటు తప్పదు!” ప్రజాధనం అస్మదీయుల పాలు కావడంపై సమగ్ర విచారణ జరుగుతోంది. రెండు రోజుల్లో కలెక్టర్‌తో పాటు ఉన్నతా ధికారులకు నివేదిక ఇస్తాం. రికార్డులు దాచినా, నిధులు మళ్లించినా ఎంతటి వారిపై నైనా చర్యలు తప్పవని డి ఎల్ పి ఓ పేర్కొన్నారు.
Also Read: మార్చి 31 నాటికి ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేసుకున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్!