E-Paper
Advertisement

కేఆర్ఎంబీ అంటే లెక్క లేదు.. త్రిసభ్య కమిటీ అంటే విలువ లేదు.. ఏపీపై హరీశ్ రావు ఫైర్

కేఆర్ఎంబీ అంటే లెక్క లేదు.. త్రిసభ్య కమిటీ అంటే విలువ లేదు.. ఏపీపై హరీశ్ రావు ఫైర్
Advertisement

Telangana Water Rights: తెలంగాణకు దక్కాల్సిన ప్రతి చుక్క నీటిని కాపాడాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర నీటి హక్కులను కాలరాస్తున్న ఏపీ నీటి తరలింపును అడ్డుకోవాలని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తెలంగాణ నీటిపారుదల శాఖ నిర్వహణలో ఉన్న సాగర్ డ్యామ్ నుంచి కేఆర్ఎంబీ అనుమతులు లేకుండానే ఏపీ వైపు కుడి కాలువకు నీటిని విడుదల చేసుకోవడం దౌర్జన్యం కాదా? అని ప్రశ్నించారు. ఏపీ 47 టీఎంసీల నీటిని కోరిందని, దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన త్రిసభ్య కమిటీ సమావేశమే వాయిదా పడిందన్నారు.

నీటి కేటాయింపులపై ఎలాంటి నిర్ణయం రాకముందే ఏపీ అధికారులు నీటిని తరలించడం ఏంటని నిలదీశారు. ‘కేఆర్ఎంబీ అనుమతులు లేకుండా నీటిని తీసుకెళ్లేంత ధైర్యం ఏపీ అధికారులకు ఎలా వచ్చింది? త్రిసభ్య కమిటీ నిర్ణయం కోసం కూడా వేచి చూడకుండా నీటిని తరలించే పరిస్థితి ఎందుకు వచ్చింది?అడ్డుకోవాల్సిన కేఆర్ఎంబీ ఎందుకు మౌనంగా ఉంటోంది? అసలు ఇంత జరుగుతుంటే తెలంగాణ నీటి హక్కులను కాపాడాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోంది?’ అని నిలదీశారు.

Advertisement

ఒకవైపు శ్రీశైలం నుంచి వెలిగొండ టన్నెల్ ద్వారా 11 టీఎంసీల నీటిని ఏపీ తరలిస్తోందని హరీశ్ రావు అన్నారు. ఇప్పుడు నాగార్జునసాగర్ కుడి కాల్వ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నీటిని తరలిస్తున్నారన్నారు. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో ఇలా ఇష్టారీతిన నీటిని తరలించడం దుర్మార్గం అన్నారు. ఇప్పటికే గత రెండేళ్లుగా కృష్ణా జలాల్లో తాత్కాలిక వాటాను సైతం వినియోగించుకోలేక మన నీళ్లను ఏపీకి ధారాదత్తం చేశారన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువ నీటి వినియోగం చేసి తెలంగాణకు తీరని ద్రోహం చేశారని, ఈ ఏడాది కూడా అదే తీరుగా వ్యవహరిస్తున్నారన్నారు.

Also Read: గట్టు గ్రామపంచాయతీలో భారీ కుంభకోణం.. రూ. 22 లక్షల ప్రజాధనం మాయం!

Advertisement

తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా జలాలను కాపాడాల్సిన ప్రభుత్వం.. ఏపీ నీటి తరలింపును అడ్డుకోకుండా చోద్యం చూస్తుందని మండిపడ్డారు. కేఆర్ఎంబీని లెక్కచేయకుండా, త్రిసభ్య కమిటీని పట్టించుకోకుండా ఏపీ వ్యవహరిస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదు? అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం మౌనం తెలంగాణ తాగు, సాగునీటి ప్రయోజనాలకు శాపంగా మారుతోందన్నారు. ఇదే వైఖరిని కొనసాగిస్తే తెలంగాణ ప్రజల ముందు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని అన్నారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి తెలంగాణ నీటి హక్కులను కాపాడాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు.

Also Read: టీమిండియా జెర్సీని తీసేసి, రౌడీల్లా త‌న్నుకోండి..జైస్వాల్ పై స‌బా క‌రీమ్ ఫైర్‌

Tags

Related News

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

మా సంకల్ప అదే.. యువతతోపాటు మహిళలను ప్రోత్సహించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి

సరైన అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్సీ టికెట్లపై బీజేపీ కసరత్తు

ప్రభుత్వ లెక్చరర్ల బాగోతంపై విద్యాశాఖలో ప్రకంపనలు.. మండిపడుతున్న ప్రజలు, చర్యలు తీసుకోవాలని డిమాండ్

ప్రైవేట్ డాక్టర్ల జీతం రూ. 25 వేలు.. ప్రభుత్వ మెడికోల స్టైఫండ్ ఎంతంటే? షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×