E-Paper
Advertisement

‘టాక్సిక్’లో ఈ తప్పులే కొంపముంచాయా?

‘టాక్సిక్’లో ఈ తప్పులే కొంపముంచాయా?
Advertisement

Toxic Movie Review: KGF Chapter 2 సినిమా తర్వాత, అది కూడా నాలుగేళ్ళ తర్వాత యష్ నుండి సినిమా వస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.ఇక సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం, సినిమాలో నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా, కియారా అద్వానీ వంటి సాలిడ్ స్టార్ క్యాస్టింగ్ ఉండటం, ఇక మూవీ నుండి రిలీజ్ అయిన ప్రతీ అప్ డేట్ అంచనాలని పెంచేయడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి స్ప్రుష్టిస్తుంది అనుకున్నారంతా.

ఎదో చూద్దాం అనుకుంటే ఇంకేదో

థియేటర్ లలోకి సినిమా వచ్చే వరకి కూడా సీన్ అలాగే ఉంది. కానీ ఎప్పుడైతే బొమ్మ తెరపై పడిందో ..అప్పటి నుండి మెల్లిగా అభిమానుల అంచనాలు నీరు కారడం మొదలైపోయాయి. ఎదో చూద్దాం అనుకుంటే ఇంకేదో కనిపిస్తుంది అనుకుంటూ ఒకరి మొహాలు మరొకరు చూడటం మొదలెట్టారు ఆడియన్స్. ఫైనల్ గా ఇది కాదు కదా మేము చూడాల్సిన సినిమా అంటూ కళ్ళు తెలేస్తూ నిరాశగా బయటికి నడవడం మొదలెట్టారు.మరి భారీ అంచనాలు మోసిన టాక్సిక్ లెక్క ఎక్కడ తప్పిందో,సినిమా లో జరిగిన ఆ తప్పులేంటో ఇప్పుడు చూద్దాం.

స్క్రిప్ట్ సెలెక్షన్ లోనే లోపం 

Advertisement

kgf సిరీస్ తో రాఖీ భాయ్ గా జనాల గుండెల్లో చోటు సంపాదించిన యష్ స్క్రిప్ట్ సెలెక్షన్ లోనే తడబడ్డాడని చెప్పాలి.ఎందుకంటే యష్ నుండి జనాలు కోరుకున్నది ఇది కాదు.హీరోగా విభిన్నమైన కథలని ఎంచుకోవాలని ఆశ ఉండొచ్చు,కాని kgf సినిమా ఇచ్చిన ఇమేజ్ వేరు. వాళ్ళు మరీ ఈ రేంజ్ లో బ్లడ్ బాత్ అండ్ టూ మచ్ గ్లామర్ ట్రీట్ ని యష్ నుండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అతడేదో ఒక ప్రపంచాన్ని చూపిద్దామనుకున్నాడు.కానీ ఉన్న ప్రపంచాన్నే కొత్తగా చూపిస్తే చాలు అన్న మైండ్ సెట్ లో ఆడియన్స్ ఉన్నారు.

సినిమాకి ఏకంగా నాలుగేళ్ళు

ఇక చెప్పాల్సిన మరో ప్రధాన లోపం ఈ సినిమాకి ఏకంగా నాలుగేళ్ళు తీసువడం.kgf 2 తో వచ్చిన ఆకాశమంత ఇమేజ్ ని నాలుగేళ్ళు హోల్డ్ లో పెట్టి దాన్ని నీరు గార్చేశాడు యష్.కనీసం రెండేళ్ళకి సినిమా వచ్చినా అభిమానుల రియాక్షన్ ఇంకోలా ఉండేది. మరియూ ఈ నాలుగేళ్ళలో ఇలాంటి టూ మచ్ బ్లడ్ బాత్ సినిమాల్ని ఆడియన్స్ పిచ్చపిచ్చగా చూసేశారు.ఇక యష్ ఉన్నప్పటికీ వారికేం కొత్తదనం కనిపించకుండా పోయింది.

కథని ఇంకాస్త సింప్లిఫై

Advertisement

ఇక సినిమాలో కథ కాసింత పర్లేదు అన్న టాక్ వచ్చినప్పటికీ ఆడియన్స్ కంప్లైంట్ అంతా సాగుతున్న సినిమాకి అస్సల్ కనెక్ట్ కాలేదనే. సీన్స్ జరుగుతున్నంత సేపు అర్థం కాకపోయినా, ఆ తర్వాత వెంటనే అర్థం అయితే ఆడియన్స్ సినిమాకి హుక్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది.కాని ఇంకాసేపు ఆగండి ఆగండి అంటూ ఎప్పుడో సినిమాని అర్థం అయ్యేలా చెప్తాం అంటూ ఆడియన్స్ పేషన్స్ ని టెస్ట్ చేస్తే ఇలానే రిజల్ట్ ఉంటుంది. ముఖ్యంగా సీన్స్ కాస్త షార్ట్ గా ఉంటె అయినా బాగుండు అన్న కామెంట్ ఆడియన్స్ నుండి గట్టిగా వినిపించింది. ముఖ్యంగా కథని ఇంకాస్త సింప్లిఫై చేయాల్సి ఉండేది.

also read :పెద్దికి ఓ రూల్.. టాక్సిక్‌కి మరో రూల్? దొరికిపోయిన రాజు బ్రదర్స్!

bgm సినిమాకి తగ్గట్టు లేదు 

ఇక మరీ ముఖ్యంగా రవి బస్రూర్ అందించిన bgm సినిమాకి తగ్గట్టు లేదన్నది ప్రధాన ఆరోపణ. bgm అంటే సీన్స్ ని ఎలివేట్ చేసేలా ఉండాలి కాని డైలాగులు వినిపించకుండా ఉండేలా కాదన్నది మూవీ లవర్స్ నుండి వినిపిస్తున్న మాట. ఇంకొన్ని చోట్ల గీతూ తీసిన హాయ్ ఇంటెన్స్ సీన్స్ లో bgm అందించడంలో రవి బస్రూర్ తేలిపోయాడని మేజర్ కంపైంట్.

600 కోట్లపైగా అంటే అనుమానమే 

ఇక వీటన్నింటికి తోడు సినిమా బడ్జెట్ ఏకంగా 600 కోట్లపైగానే అని ఊదరగొట్టారు మేకర్స్,కానీ సినిమా ఆస్థాయిలో లేదన్నది మరో ఆరోపణ. యష్ క్రేజీ లుక్ , స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ , గ్రాండియర్ విజువల్స్ ఇలా సినిమా ఒక రేంజ్ లో ఉంటుందని అంచనాలు పెంచినప్పటికీ సినిమా ఆ అంచనాలు అందుకోలేదని, ఇంకా మరింత బెటర్ విజువల్ ఎక్స్పెక్ట్ చేశామన్నది అభిమానుల వాదన.

also read :టాక్సిక్ దెబ్బకి దిల్ రాజు విలవిల?

సినిమా రన్ కి అసలైన పరీక్ష

మొత్తంగా సినిమా ఎన్ని లోపాలని మోసుకొచ్చినా యష్ స్టైలిష్ యాక్టింగ్ మాత్రం టాప్ నాచ్ అని చెప్పాలి.మరి ఇదే సినిమాని గట్టున పడేస్తుందా అంటే అనుమానమే !అయితే సినిమాకి ముందే సాలిడ్ బుకింగ్స్ కావడంతో సినిమా ఈ మూడు రోజులు బాగానే వసూలు చేసే అవకాశం ఉంది.ఆ తర్వాత ఏంటి అన్నదే సినిమా రన్ కి అసలైన పరీక్ష !

Tags

Related News

‘కింగ్ 100’లో ఐశ్వర్య రాజేష్..నిజమెంత?

సుప్రీంకోర్టులో లాయర్ గా పనిచేస్తున్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?

పవర్ స్టార్ బర్త్ డే కు ‘ఓజీ2’ అప్డేట్ ఉంటుందా..? ఫ్యాన్స్ వెయిటింగ్..

కుర్చీ కోసం ఎవరి గేమ్ వాళ్లదే! రచ్చ లేపుతున్న ‘ధర్మస్థల నియోజకవర్గం’ ట్రైలర్!

రూ. 300 కోట్ల రికార్డుకు ఎసరు పెట్టిన ‘బెత్లెహెం’

ఇరుముడి దెబ్బకు రవితేజ పాత రికార్డులన్నీ గల్లంతే!

బాలయ్య vs నాగ్.. పాత లెక్కలేంటి? ఈసారి గెలుపెవరిది?

ఇరుముడి సక్సెస్  పెరిగిన కొమరక్క రెమ్యూనరేషన్.. ఫస్ట్ జీతం ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×