E-Paper
Advertisement

దేశానికే ఆదర్శంగా తెలంగాణ మహిళా సంఘాలు.. ఢిల్లీ వేదికగా జాతీయ అవార్డు!

దేశానికే ఆదర్శంగా తెలంగాణ మహిళా సంఘాలు.. ఢిల్లీ వేదికగా జాతీయ అవార్డు!
Advertisement

Telangana PMFME: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, వారిని స్వయం ఉపాధి నుంచి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ (పీఎంఎఫ్ఎంఈ) పథకంలోని సీడ్ క్యాపిటల్ కాంపోనెంట్‌ను స్వయం సహాయక సంఘాలకు సమర్థవంతంగా అందించడంలో తెలంగాణ రాష్ట్రానికి “బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్ – ఫస్ట్ రన్నర్ అప్” అవార్డు దక్కింది.

మంత్రి చిరాగ్ పాశ్వాన్..

న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్‌లో నిర్వహించిన ఎంఓఎఫ్పీఐ-పీఎంఎఫ్ఎంఈ నేషనల్ కాన్‌క్లేవ్–2026లో కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ చేతుల మీదుగా తెలంగాణ తరఫున సెర్ప్ డైరెక్టర్ (ఫామ్) ఎన్. రజిత అవార్డును అందుకున్నారు.ఈ అవార్డు మహిళా సంఘాలను కేవలం పొదుపు, రుణాలకే పరిమితం చేయకుండా, వారికి మూలధనం అందించి ఉత్పత్తి, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ రంగాల్లో ఆర్థికంగా ఎదిగేలా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానానికి దక్కిన గుర్తింపు అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

Advertisement

Also Read: పగలంతా పాటలు – రాత్రంతా ఆటలు..ఫోక్ సింగర్ కామెంట్స్ వైరల్

ప్రభుత్వ పథకాలు..

మహిళా సంఘాల సభ్యులు, సెర్ప్ అధికారులు, సిబ్బందికి ఆమె అభినందనలు తెలిపారు.తెలంగాణలో పీఎంఎఫ్ఎంఈ సీడ్ క్యాపిటల్‌ను మహిళా సంఘాల అవసరాలకు అనుగుణంగా సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా ఈ జాతీయ స్థాయి గుర్తింపు సాధ్యమైందని తెలిపారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో మహిళలకు చేరవేయడంతో పాటు, ఆర్థిక కార్యకలాపాలకు అనుసంధానం చేయడంలో సెర్ప్ యంత్రాంగం కీలక పాత్ర పోషించిందన్నారు. మహిళా సంఘాలు చిన్న వ్యాపారాల నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులు, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, బ్రాండెడ్ ఉత్పత్తుల వరకు విస్తరించి బలమైన వ్యాపార సంస్థలుగా ఎదగాలని ఆకాంక్షించారు.

Advertisement

Also Read: కూతురి వ్యాఖ్యలతో మాకేం సంబంధం.. కాంగ్రెస్‌లోనే ఉంటాం.. కొండా మురళి క్లారిటీ!

Tags

Related News

2 లక్షల మందితో కాంగ్రెస్ భారీ భహిరంగ సభ.. ఎందుకో క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

మా సంకల్ప అదే.. యువతతోపాటు మహిళలను ప్రోత్సహించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి

సరైన అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్సీ టికెట్లపై బీజేపీ కసరత్తు

ప్రభుత్వ లెక్చరర్ల బాగోతంపై విద్యాశాఖలో ప్రకంపనలు.. మండిపడుతున్న ప్రజలు, చర్యలు తీసుకోవాలని డిమాండ్

Big Stories

Advertisement
×