E-Paper
Advertisement

దర్జాగా ట్రావెల్ బస్సులో గంజాయి స్మగ్లింగ్.. స్కెచ్చేసి మరీ పట్టుకున్న పోలీసులు!

దర్జాగా ట్రావెల్ బస్సులో గంజాయి స్మగ్లింగ్.. స్కెచ్చేసి మరీ పట్టుకున్న పోలీసులు!
Advertisement

Cannabis Seized: ట్రావెల్‌ బస్సులో అక్రమంగా తరలిస్తున్న 5 కిలోల ఎండు గంజాయిని ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలో మహమ్మద్‌ ఖాదర్‌ (46)ను అరెస్టు చేశారు. బుధవారం తెల్లవారుజామున ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు ఫయాజ్‌, విష్ణుమూర్తి ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్‌ సీఐలు ఎం.పీ.ఆర్‌. చంద్రశేఖర్‌, బిక్షారెడ్డి ఆధ్వర్యంలో గుండ్లపోచంపల్లి శివారులోని మలీబు రెస్టారెంట్‌ ఎదురుగా వాహన తనిఖీలు చేపట్టారు.

ట్రావెల్‌ బస్సుల్లో గంజాయి..

నాగ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చే ట్రావెల్‌ బస్సుల్లో గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో ప్రయాణికులను తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఇస్లాంపూర్‌, ఇచ్చోడ, ఆదిలాబాద్‌కు చెందిన మహమ్మద్‌ ఖాదర్‌ హ్యాండ్‌బ్యాగ్‌ను తనిఖీ చేయగా, ఐదు ప్యాకెట్లలో ఉన్న 5 కిలోల ఎండు గంజాయి బయటపడింది. దీంతో గంజాయిని స్వాధీనం చేసుకుని ఖాదర్‌ను అరెస్టు చేశారు. విచారణలో గోల్కొండకు చెందిన మహమ్మద్‌కు గంజాయిని సరఫరా చేసి ఇద్దరూ కలిసి విక్రయిస్తున్నట్లు ఖాదర్‌ తెలిపినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Also Read: పాడుబడిన స్కూల్ లో పారానార్మల్ సీన్స్… సైకాలజిస్ట్‌కు ఎదురైన ఒళ్లు గగుర్పొడిచే షాకింగ్ నిజం

50 గ్రాముల ప్యాకెట్‌..

నాగ్‌పూర్‌లో ఒడిశాకు చెందిన గుర్తుతెలియని వ్యక్తుల వద్ద కిలో గంజాయిని రూ.2 వేల చొప్పున కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో 50 గ్రాముల ప్యాకెట్‌ను రూ. 500కు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయితో పాటు నిందితుడిని మేడ్చల్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌కు అప్పగించారు. గంజాయి విలువ సుమారు రూ.2.50 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐలు బాల్‌రాజ్‌, సాయికిరణ్‌రెడ్డితో పాటు ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Also read: FM రేడియోకు ఏమైంది? స్మార్ట్‌ఫోన్ల నుంచి ఈ ఫీచర్ ఎందుకు మాయమైంది?

Tags

Related News

2 లక్షల మందితో కాంగ్రెస్ భారీ భహిరంగ సభ.. ఎందుకో క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

మా సంకల్ప అదే.. యువతతోపాటు మహిళలను ప్రోత్సహించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి

సరైన అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్సీ టికెట్లపై బీజేపీ కసరత్తు

ప్రభుత్వ లెక్చరర్ల బాగోతంపై విద్యాశాఖలో ప్రకంపనలు.. మండిపడుతున్న ప్రజలు, చర్యలు తీసుకోవాలని డిమాండ్

Big Stories

Advertisement
×