BigTV English

Kothaguda Flyover : హైదరాబాద్ వాసులకు న్యూఇయర్ గిఫ్ట్.. ఆ ఫ్లై ఓవర్ ఓపెనింగ్ కు సిద్ధం..

Kothaguda Flyover : హైదరాబాద్ వాసులకు న్యూఇయర్ గిఫ్ట్.. ఆ ఫ్లై ఓవర్ ఓపెనింగ్ కు సిద్ధం..

Kothaguda Flyover : హైదరాబాద్ వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసంఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు నిర్మిస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల ఫ్లై ఓవర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు నూతన సంవత్సర కానుకగా ఆదివారం కొత్తగూడ ఫ్లై ఓవర్‌ ను రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. గచ్చిబౌలి ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్యలను తీర్చేందుకు రూ. 263 కోట్ల వ్యయంతో కొత్తగూడ నుంచి గచ్చిబౌలి వరకు 2,216 మీటర్ల పొడవుతో ఈ ఫ్లై ఓవర్‌ ను నిర్మించారు. నగర వాసులకు సిగ్నల్‌ రహిత రవాణా వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు ఎస్ఆర్డీపీ కింద జీహెచ్‌ఎంసీ ఈ నిర్మాణం చేపట్టింది.


కొత్తగూడ-గచ్చిబౌలి ప్రధాన ఫ్లైఓవర్‌ను ఎస్‌ఎల్‌ఎన్‌ టెర్మినల్ నుంచి బొటానికల్‌ జంక్షన్‌ వరకు 5లేన్లతో నిర్మించారు. బొటానికల్‌ జంక్షన్‌ నుంచి కొత్తగూడ జంక్షన్‌ వరకు 6 లేన్లు ఏర్పాటు చేశారు. కొత్తగూడ జంక్షన్‌ నుంచి కొండాపూర్‌ ఆర్టీఏ ఆఫీస్‌ వరకు 3 లేన్ల రోడ్డుతో ఈ ఫ్లైఓవర్‌ను పూర్తి చేశారు. మసీదుబండ నుంచి బొటానికల్‌ జంక్షన్‌ వరకు రెండు లేన్లతో బొటానికల్‌ అప్‌ ర్యాంపు, కొత్తగూడ నుంచి హైటెక్‌ సిటీ వెళ్లేందుకు 383 మీటర్ల పొడవుతో హైటెక్‌ సిటీ వైపు 3లేన్ల డౌన్‌ ర్యాంపును ఏర్పాటు చేశారు. 470 మీటర్ల పొడవుతో 3లేన్లతో అండర్‌ పాస్‌ను హఫీజ్‌పేటకు వెళ్లేందుకు నిర్మించారు.

కొత్తగూడ ఫ్లై ఓవర్‌ వల్ల బొటానికల్‌ గార్డెన్‌, కొత్తగూడ, కొండాపూర్‌ జంక్షన్‌ల మధ్య చాలా తక్కువ దూరంలో ఉన్న కూడళ్ల నుంచి సాఫీగా వెళ్లేందుకు వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న గ్రేటర్‌ కారిడార్‌కు ఇరువైపులా వాణిజ్య పరమైన నిర్మాణాలకు ప్రయోజనం కలుగుతుంది. ఈ జంక్షన్‌ల పరిసరాల్లో అనేక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో రద్దీ సమయంలో ట్రాఫిక్‌ సమస్య తగ్గుతుంది. గచ్చిబౌలి నుంచి మియాపూర్‌ వరకు, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌ నుంచి హైటెక్‌ సిటీ వరకు కనెక్టివిటీతోపాటు మియాపూర్‌, హైటెక్‌ సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌ పరిసర ప్రాంతాలను కలుపుతుంది.


హైదరాబాద్ నగరం నుంచి శివారు ప్రాంతాలకు వెళ్లే కూడళ్లలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లోనే ప్రభుత్వం ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు నిర్మిస్తోంది.

Tags

Related News

Heavy rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన

Komatireddy Rajagopalreddy: హమ్మయ్య..! రాజగోపాల్ రెడ్డి ఇగో చల్లారినట్టేనా?

Weather News: కుండపోత వర్షం.. సాయంత్రం నుంచి ఈ జిల్లాల్లో దంచుడే.. ఇంట్లోనే ఉంటే బెటర్

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Big Stories

×