BigTV English

Nayanthra – Trisha : న‌య‌న్ మీద త్రిష‌కు ఇలాంటి ఒపీనియ‌న్ ఉందా?

Nayanthra – Trisha : న‌య‌న్ మీద త్రిష‌కు ఇలాంటి ఒపీనియ‌న్ ఉందా?

Nayanthra – Trisha : చెన్నై సోయ‌గం త్రిష సినిమా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 20 ఏళ్ల‌యింది. రెండు ద‌శాబ్దాలైనా ఇంకా అంతే యంగ్‌గా క‌నిపిస్తున్నారు త్రిష‌. రీసెంట్‌గా పొన్నియిన్ సెల్వ‌న్ ప్ర‌మోష‌న్ల‌లో త్రిష‌ను చూసిన వారంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. ఈమెతో పాటు అటూ ఇటూగా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టారు న‌య‌న‌తార‌. మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీ ద్వారా సినిమాల్లోకి ప‌రిచ‌య‌మైన న‌య‌న్ ఓ సంద‌ర్భంలో త్రిష‌ను ఓవ‌ర్‌టేక్ చేశారు. లేడీ సూప‌ర్‌స్టార్ అని బిరుదు కూడా తెచ్చుకున్నారు. వీరిద్ద‌రి కెరీర్ మీద ఎప్పుడూ చెన్నై వీధుల్లో కంపేరిజ‌న్ జ‌రుగుతూనే ఉంటుంది. ఈ ఏడాది కూడా న‌య‌న్‌కీ, త్రిష‌కీ మ‌ధ్య ఉన్న పోలిక‌ల మీద చాలా ఆర్టిక‌ల్స్ రాసిన‌వారున్నారు. ఈ ఏడాది న‌య‌న్ పెళ్లి చేసుకున్నారు. స‌రోగ‌సీ ద్వారా ఇద్ద‌రు మ‌గ‌పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చారు. త్రిష‌కి రీ ఎంట్రీ పొన్నియిన్ సెల్వ‌న్‌తో అద్భుతంగా కుదిరింది. త్వ‌ర‌లోనే న‌య‌న్ భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో త్రిష న‌టించ‌నున్నారు. ఈ సినిమాలో అజిత్ హీరోగా న‌టిస్తున్నారు.


త్రిష న‌టించిన రాంగీ సినిమా ఈ వారంలోనే రిలీజ్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌మోష‌న్‌లో పార్టిసిపేట్ చేసిన త్రిష‌ని విలేక‌రులు ఓ ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న అడిగారు. ఎప్పుడూ న‌య‌న్‌తో మిమ్మ‌ల్ని కంపేర్ చేస్తుంటే ఏమ‌నిపిస్తుంది? అని… అందుకు త్రిష జ‌వాబు చెబుతూ “అలా కంపేర్ చేయ‌డం మంచిదే. ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామ‌మే. కానీ ఒక‌రికి పొగుడుతూ, మ‌రొక‌రిని కించ‌ప‌రిచేలా ఉండ‌కూడ‌దు కంపేరిజ‌న్‌. మా ఇద్ద‌రి మ‌ధ్య క‌నిపించే మంచి విష‌యాల‌ను పోల్చ‌డం బావుంటుంది. మా ఇద్ద‌రి అభిమానులు కూడా అలాంటివి చ‌దివి ఆహ్వానిస్తారు“ అని అన్నారు. నిజానికి త్రిష అండ్ న‌య‌న‌తార ఒక‌రినొక‌రు పెద్ద‌గా క‌లుసుకున్న‌ది లేదు. ఆర్య సోద‌రుడు స‌త్య క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మైన అమ‌ర‌కావ్యం అనే అనే సినిమా ఆడియో రిలీజ్ వేడుక‌లో మాత్రం పాల్గొన్నారు. అప్పుడు కూడా ఒక‌రితో ఒక‌రు పెద్ద‌గా మాట్లాడుకున్న‌దైతే లేదు. ఫ్యూచ‌ర్‌లో ఎలాంటి రిలేష‌న్‌షిప్‌ని కంటిన్యూ చేస్తారో చూడాలి.


Tags

Related News

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Big Stories

×