BigTV English

KRMB Key decision: తెలంగాణ, ఏపీకి నీటి కేటాయింపులు, మరోసారి భేటీ

KRMB Key decision: తెలంగాణ, ఏపీకి నీటి కేటాయింపులు, మరోసారి భేటీ

KRMB Key decisions(Telangana news live): తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రం కావడంతో తాగునీటికి పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కృష్ణాబోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తాగునీటి అవసరాల కోసం నాగార్జున‌సాగర్ నుంచి తెలంగాణ 8.5 టీఎంపీలు, ఏపీకి 5.5 టీఎంసీలు తీసుకునేందుకు కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


హైదరాబాద్‌లోకి జలసౌధలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ భేటీ అయ్యింది. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ అధికారుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. తెలంగాణకు కేటాయించిన 11 టీఎంసీల కంటే ఎక్కువ తీసుకుందని ఏపీ ఆరోపణ చేసింది. తెలంగాణ పరిధిలో రెండు కోట్ల మందికి తాగునీటి అవసరాలు ఉన్నాయని వాదించగా, ఏపీలో 17లక్షల జనాభాకే నీరు అందాల్సి ఉందని తెలంగాణ గుర్తు చేసింది.

చివరకు ఏపీ 14 టీఎంసీలు, తెలంగాణ 10 టీఎంసీలు కావాలని చేసిన డిమాండ్ కమిటీ తోసిపుచ్చింది. రిజర్వాయర్లు లేని కారణంగా గతేడాది క్యారీ ఓవర్ కింద ఉన్న 18 టీఎంసీలు ఉండిపోయాయని తెలంగాణ అధికారులు తెలిపారు. ఏపీకి మాత్రం పెన్నా బేసిన్‌కు తరలించి నీటిని నిల్వ చేసుకుందని ఆరోపించింది. శ్రీశైలం నుంచి దిగువకు నీటిని వదులుదామని బోర్డు సభ్యుడు శంఖ్వా ప్రతిపాదించారు.


Also Read: తెలంగాణ ఇంటర్ ఫలితాలపై కీలక అప్డేట్.. ఈనెల 20వ తేదీ తర్వాతే రిజల్ట్స్

తాగునీటి అవసరాల నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని ఇరు రాష్ట్రాలకు బోర్డు సూచన చేసింది. మే నెల వరకు రెండు రాష్ట్రాలు 14 టీఎంసీల నీటిని వినియోగించుకోనున్నాయి. ఇంకా మిగులు మూడున్నర టీఎంసీలను భవిష్యత్ అవసరాలకు మినహాయించారు. అంతేకాదు మే నెలలో మరోసారి ఈ కమిటీ భేటీ కానుంది. అప్పటి పరిస్థితులను అంచనా వేయనుంది.

Tags

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×