E-Paper
Advertisement

ORRపై ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ఆటో, ముగ్గురు దుర్మరణం!

ORRపై ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ఆటో, ముగ్గురు దుర్మరణం!
Advertisement

ORR Accident: హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి, అలసిపోయిన శరీరాలతో ఇళ్లకు తిరిగొస్తున్న ఉపాధి కూలీలను విధి దారుణంగా వెన్నుపోటు పొడిచింది. తెలంగాణ పోలీస్ అకాడమీ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో కోలుకోలేని చీకట్లను నింపింది.

లారీని ఢీకొట్టిన ఆటో

Advertisement

అప్పా జంక్షన్ వద్ద వేగంగా వెళ్తున్న ఒక ఆటో, ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో సామర్థ్యానికి మించి ఏకంగా 17 మంది ప్రయాణిస్తున్నారు. ఢీకొట్టిన తీవ్రతకు ఆటో ముక్కలైపోగా, అందులో ప్రయాణిస్తున్న సురేష్, పెంటయ్య, లింగరాజు అనే ముగ్గురు కూలీలు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.

పచ్చదనం నింపేందుకు వెళ్లి… అనంత లోకాలకు

Advertisement

మృతులతో పాటు గాయపడిన వారంతా ముచింతవల్‌ ప్రాంతంలో చెట్లు నాటే పని ముగించుకుని, మొయినాబాద్ వైపు ఆటోలో తిరిగొస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. పచ్చదనాన్ని నింపేందుకు వెళ్లిన కూలీలు ఇలా శవాలై తేలడంతో స్థానికంగా తీవ్ర శోకసంద్రం అలుముకుంది.

Also Read: తెలంగాణ బీజేపీ చీఫ్ మార్పు వార్తల్లో నిజమెంత? క్లారిటీ ఇచ్చేసిన కీలక నేతలు!

Tags

Related News

తెలంగాణ బీజేపీ చీఫ్ మార్పు వార్తల్లో నిజమెంత? క్లారిటీ ఇచ్చేసిన కీలక నేతలు!

తెలంగాణ వైద్యరంగంలో బిగ్ అప్‌డేట్.. ఒకేసారి 359 పీజీ సీట్లకు NMC గ్రీన్ సిగ్నల్!

రాహుల్‌ గాంధీకి నల్ల జెండాల నిరసన తప్పదు: రాంచందర్ రావు

మాదాపూర్‌కు సరికొత్త ల్యాండ్‌మార్క్.. లగ్జరీ లుక్‌లో తమ్మిడికుంట చెరువు!

భార్య చిన్న కోరిక.. తట్టుకోలేక గొంతు నులిమి చంపిన భర్త, నిందితుడు కానిస్టేబుల్

గంటలో రూ.7.09 కోట్లు మాయం.. హైదరాబాద్ NBFC ఖాతాపై సైబర్ క్రిమినల్స్ పంజా!

డిఫెన్స్ మద్యం బాటిళ్లతో.. దందా చేస్తున్న రెండు జంటలు!

Big Stories

Advertisement
×