BigTV English

KTR : జై శ్రీరామ్.. మార్పు అందుకేనా కేటీఆర్?

KTR : జై శ్రీరామ్.. మార్పు అందుకేనా కేటీఆర్?

KTR : జై శ్రీరామ్. జైజై శ్రీరామ్. హనుమాన్ జయంతి ధూంధాంగా జరిగింది. శోభయాత్రతో మారుమోగింది. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు.. మాలధారులకు సామూహిక భోజనాలతో పండగ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో హనుమాన్ జయంతి వేడుకలకు హాజరయ్యారు. పూజలు నిర్వహించి.. భక్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. జై శ్రీరామ్.. జై హనుమాన్.. అంటూ గొంతెత్తి నినదించారు. ఆ వీడియోను బీజేపీ శ్రేణులు ఇప్పుడు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. గతంలో శ్రీరాముడి గురించి కేటీఆర్ చేసిన కామెంట్స్‌ను, ఇప్పటి విజువల్స్‌ను ఎడిట్ చేసి.. మీమ్స్‌తో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నారు.


కేటీఆర్ కాంట్రవర్సీ కామెంట్స్

జై శ్రీరామ్ నినాదంపై గతంలో కేటీఆర్ కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు. బీజేపీని, మోదీని విమర్శించే క్రమంలో.. జై శ్రీరామ్ నినాదం ఏమైనా కడుపు నింపుతుందా? అని అన్నారు. ఎవరైనా పిల్లలు జై శ్రీరామ్ అంటే వారిని కూడా సంజాయించాలే.. అని కేటీఆర్ అనడం అప్పట్లో వివాదంగా మారింది.


మార్పు మంచిదేనా?

కాలం గిర్రున తిరిగి.. అధికారం తిరగబడటంతో.. కేటీఆర్‌లోనూ మార్పు వచ్చిందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. జై శ్రీరామ్ నినాదంతో కడుపు నిండుతుందా? అన్న నాయకుడే ఇప్పుడు హనుమాన్ జయంతి వేడుకల్లో ఉత్సాహంగా భాగస్వామి కావడంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. తానూ హిందువునేనని, దేవుడిని మొక్కుతానని, పూజలు చేస్తానని.. అనడమే కానీ కేటీఆర్ ఇలా బహిరంగంగా దైవకార్యక్రమంలో పాల్గొనడం అరుదనే చెబుతున్నారు. ఎమ్మెల్సీ కవిత మాత్రం తరుచూ కొండగట్టు అంజన్న ఆలయానికి వెళ్తుంటారు కానీ.. కేటీఆర్ అలా గుళ్లకు, ఇలా పూజలు అటెండైన సందర్భాలు తక్కువే. తాజాగా హనుమాన్ జయంతికి సిరిసిల్లకు వెళ్లడం.. భక్తులతో కలిసిపోవడం.. రాజకీయంగానూ ఇంట్రెస్టింగ్ పాయింట్.

Also Read : శ్రీవర్షిణి నెగ్గిందా.. ఓడిందా? ఈ ప్రశ్నలకు బదులేది అఘోరీ?

కేటీఆర్ లెక్క అదేనా?

తెలంగాణలో అధికార కాంగ్రెస్ జోరు మీదుంది. బీజేపీ సైతం నేనున్నానంటోంది. మధ్యలో బీఆర్ఎస్ పరిస్థితే కాస్త తేడాగా ఉంది. నెంబర్ 2 కోసమా? నెంబర్ 3 కోసమా? గులాబీ పోరాటం ఏ స్థానం కోసమో అర్థం కాకుండా పోతోంది. ఇక, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హనుమాన్ భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. కొండగట్టు అంజన్న మహిమ అది. ఇప్పుడిలా హనుమాన్ పూజలకు హాజరై.. అటెండెన్స్ వేసుకొని.. అలా రామభక్తులకు సన్నిహితం కావాలనా కేటీఆర్ ప్లాన్ అని బీజేపీ అనుమానంగా చూస్తోంది. ఆ పార్టీ సోషల్ మీడియా శ్రేణులు మాత్రం కేటీఆర్ పాత డైలాగ్‌ను మళ్లీ బయటకు తీసి.. కొత్తగా వైరల్ చేస్తున్నారు. ఇదంతా బీజేపీ ఎఫెక్ట్ అని.. కాషాయ పార్టీకి భయపడే కేటీఆర్ రామ జపం చేస్తున్నారంటూ మీమ్స్, సెటైర్స్, ట్రోల్స్‌తో చెడుగుడు ఆడుకుంటున్నారు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×