
KTR: ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కేసు రాజకీయ మంటలు మరింతగా ఎగిసిపడుతున్నాయి. సిట్ విచారణను రద్దు చేసి.. సీబీఐకి కేసును అప్పగిస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో సర్కారు డిఫెన్స్ లో పడింది. ఇదే అదనుగా కమలనాథులు కేసీఆర్ ను మరింతగా టీజ్ చేస్తున్నారు. ఫాంహౌజ్ ఫైల్స్ సినిమా అట్టర్ ఫ్లాప్ అంటూ.. హైకోర్టు తీర్పు కేసీఆర్ కు చెంపపెట్టు అంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కామెంట్లు చేశారు. కట్ చేస్తే.. కిషన్ రెడ్డికి మంత్రి కేటీఆర్ అదే స్థాయిలో స్ట్రాంగ్ కౌంటర్ వేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో దొంగల ముసుగులు తొలిగాయని.. కలుగులో దాక్కున్న దొంగలు బయటకు వస్తున్నారని కేటీఆర్ అన్నారు. కేసు సీబీఐకి అప్పగిస్తే బీజేపీ నేతలు సంబరాలు ఎందుకు ఎందుకు చేసుకుంటున్నారని.. కేసు తమ జేబు సంస్థ అయిన సీబీఐకి ఇచ్చినందుకా? అని ప్రశ్నించారు. సీబీఐ అంటే ‘సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్’ గా మారిందంటూ మండిపడ్డారు. స్వామీజీలతో సంబంధం లేదంటున్న దొంగలకు నార్కో అనాలసిస్, లై డిటెక్షర్ టెస్టులకు సిద్ధమా?.. దమ్ముంటే కిషన్ రెడ్డి తన సవాల్ స్వీకరించాలంటూ ఛాలెంజ్ చేశారు కేటీఆర్.
అసలు కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
ఫాంహౌస్ కేసులో హైకోర్టు తీర్పు కేసీఆర్కు చెంపపెట్టులాంటిదన్నారు కిషన్ రెడ్డి. తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరలేపాడని.. ఫాంహౌస్ పేరుతో కుట్రలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఫాంహౌస్ ఘటన తర్వాత నలుగురు ఎమ్మెల్యేలను ప్రగతిభవన్ లో ఎందుకు బంధించారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్ల డేటాను ఎందుకు బయటపెట్టలేదని నిలదీశారు. అబద్ధాలు, గారడీ చేయడం కేసీఆర్కు వెన్నతో పెట్టిన విద్య అంటూ విమర్శించారు. ఇతర పార్టీలపై బురద జల్లడం బీఆర్ఎస్ కు అలవాటేనని తప్పుబట్టారు. బురదలో నుంచే కమలం పువ్వు వికసిస్తుందని.. కానీ కమలానికి ఎలాంటి బురద అంటదని కిషన్ రెడ్డి అన్నారు. ఫాం హౌస్ కేసులో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న కిషన్ రెడ్డి.. న్యాయస్థానాలపై తమకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు.
KA Paul | సీఈఓ వికాస్ రాజ్ అమ్ముడుపోయారు.. కాంగ్రెస్ అభ్యర్థులతో కేసీఆర్ మంతనాలు : కె ఏ పాల్