Nindu Noorella Saavasam Serial Today Episode: రణవీర్ ఇంటి నుంచి కోపంగా అమర్ ఇంటికి వచ్చిన మనోహరి.. మిస్సమ్మ అబార్షన్ చేయించుకుంటానని రాథోడ్ తో చెప్పడం వింటుంది. దీంతో మనోహరి చాలా హ్యాపీగా ఫీలవుతుంది. శభాష్ భాగీ నా చేతులకు మట్టి అంటకుండా నీ చేతులకు నువ్వే రక్తాన్ని అంటించుకుంటున్నావు. నాకు శ్రమ తగ్గిస్తున్నావు. రేపు నీ కడుపులో బిడ్డను చంపి ఆ తర్వాత అమర్ దృష్టిలో నువ్వు చచ్చినా బతికినా ఒకటే.. మెల్లగా నిన్ను అమర్‌కు దూరం చేసి నేను దగ్గర అవుతాను అనుకుంటూ పిల్లల రూంలోకి వెళ్తుంది. అందరూ చదువుకుంటూ ఉంటారు. వాళ్లను చూసిన మనోహరి. ముందు ఈ పిల్లల దగ్గర పొగ పెట్టి నిప్పు రాజేస్తాను. ఏ పిల్లల కోసం భాగీ తన సొంత బిడ్డను వద్దనుకుంటుందో ఆ బిడ్డను సాకుగా చూపించి ఈ పిల్లల మనసు మార్చస్తాను అని మనసులో అనుకుని హాయ్ పిల్లలు ఏం చేస్తున్నారు అని అడగ్గానే..
అంజు లేచి ఆ కోతి కొమ్మచ్చి ఆడుకుంటున్నాం ఆంటీ అంటుంది. దీంతో మనోహరి కోపంగా దీనికి అనవసరంగా నా బ్లడ్ ఇచ్చాను. జలగ లాగా నా రక్తమే పీల్చి నాతో ఆటలాడుతుందా..? అని మనసులో అనుకుంటూ ఓ హోం వర్క్ చేసుకుంటున్నారా..? అని అనగానే.. అంజు వెటకారంగా నవ్వుతూ హోం వర్క్ చేసుకుంటున్నారా..? స్కూల్ వెళ్తున్నారా..? తిరిగి ఎప్పుడు వస్తారు. ఇలాంటి రొటీన్ క్వశ్చన్స్ వద్దు ఆంటీ స్ట్రెయిట్‌గా పాయింట్‌కు రండి అనగానే.. ఏంటి ఈ ఇంట్లో సెలబ్రేషన్స్ ఏమీ లేవా..? అని మనోహరి అడగ్గానే.. అమ్ము సెలబ్రేషన్స్ ఏంటి..? అని అడుగుతుంది. అదే కేక్ కటింగ్ చేయడం.. టపాసులు పేల్చడం.. స్వీట్లు పంచడం ఎక్ట్రా ఎక్ట్రా అని మనోహరి చెప్తుంది. ఆనంద్ లేచి అవన్నీ ఎందుకు చేయాలి ఆంటీ అని అడుగుతాడు. ఎందుకు మీ బర్తుడే వచ్చిందా..? అని అంజు అడుగుతుంది.
దీంతో ఏంటి అంజు నన్ను స్ట్రెయిట్‌గా మట్లాడమని చెప్పి మీరు నాన్చుతున్నారేంటి..? అనగానే.. ఆకాష్ అసలు విషయం ఏంటి ఆంటీ అని అడగుతాడు. దీంతో మీకు తెలుసు కదా..? మిస్సమ్మ.. అదే మీ భాగీ కన్సీవ్ అయింది. తర్వలో మీకు చెల్లో తమ్ముడో వస్తాడు. మరి సంబరాలు జరుపుకోరా ఏంటి..? ఏ అమ్ము నలుగురిలో నువ్వే పెద్దదానివి ఈ సెలబ్రేషన్స్ అవీ నువ్వే కదా ప్లాన్ చేయాలి. అని మనోహరి చెప్పగానే.. ఏ నేను ప్లాన్ చేయకూడదా..? అంటుంది అంజు.. నేను అడిగింది అమ్మూను అని మనోహరి చెప్పగానే.. మీరు ఎవ్వరిని అడిగినా నేనే ఆన్సర్ చెప్తాను.. అంటుంది. ఎందుకు అందరికంటే చిన్నదానివి అనా..? త్వరలో నీకు ఆ హోదా పోతుందిలే.. నీకన్నా చిన్నది ఇంటికి వస్తుంది. ఒక్క నీ హోదా మాత్రమే కాదులో మిగతా ఈ ముగ్గురి పరిస్థితి కూడా ఏమౌతుందో ఏమో అంటుంది.
అమ్ము మాకేం అవుతుంది ఆంటీ అని అడగ్గానే.. ఇప్పటి వరకు ఏం కాలేదు అంతా బాగానే ఉంది. కానీ ముందు ముందు ఎలా ఉంటుందో చెప్పలేం కదా అని మనోహరి డౌటుగా చెప్తుంటే.. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని ఆనంద్ అడుగుతాడు. దీంతో మనోహరి అదే పుట్టబోయే మీ పిన్ని బిడ్డ గురించి ఆ బేబీ వచ్చాక పరిస్థితి అంతా మారిపోతుంది అని చెప్పగానే.. ఎందుకు మారిపోతుంది ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు అలాగే ఉంటుంది కదా అంటాడు ఆకాష్. అలా ఉండదు ఆకాష్ ఒక కొత్త మనిషి ఇంటికి వచ్చాక కచ్చితంగా ఇంట్లో ఒక కొత్త మార్పు వస్తుంది అని మనోహరి చెప్పగానే.. అమ్ము ఏంటా మార్పు మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు ఆంటీ..? అని అడుగుతుంది.
మనోహరి డోర్ క్లోజ్ చేసి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ముందు ముందు మిస్సమ్మ వల్ల మీకు ప్రమాదం రాబోతుంది. అని చెప్పగానే పిల్లలు అందరూ భయపడతారు. ఇంతలో అంజు మిస్సమ్మతో మాకు ప్రమాదమా..? ఏం మాట్లాడుతున్నారు ఆంటీ అని అడుగుతుంది. దీంతో మనోహరి కోపంగా చూస్తూ.. మిస్సమ్మ మీరు అనుకున్నంత మంచిదేం కాదు.. అని చెప్పగానే.. పిల్లలు ఆలోచిస్తుంటారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.