KTR Comments on Kavitha’s Bail: కవిత బెయిల్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత బెయిల్ ప్రాసెస్ కొనసాగుతుంది.. వచ్చే వారం కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉందన్నారు. కవిత హెల్త్ సిక్ అయ్యింది.. ఇప్పటివరకు కవిత 11 కేజీల బరువు తగ్గారంటూ కేటీఆర్ పేర్కొన్నారు.
Also Read: సుంకిశాల ప్రాజెక్టు ఎందుకు ప్రారంభించారో కేసీఆర్, కేటీఆర్‌కే తెలియాలి: గుత్తా
ఇదిలా ఉంటే.. ఈ నెల 19న రాఖీ పండుగ. ప్రతిసారి కేటీఆర్ కు కవిత రాఖీ కడుతుంది. అనంతరం రాఖీ పండుగ శుభాకాంక్షలు చెబుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పేవారు. అయితే, కవిత ప్రస్తుతం జైలులో ఉన్న విషయం తెలిసిందే. కవితకు త్వరగా బెయిల్ దొరకాలని, ఆమె ఆరోగ్యం బాగుండాలంటూ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. ప్రతిసారి లాగే ఈసారి కూడా కవిత రాఖీ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.