BigTV English

YS Jagan: సుప్రీం సీరియస్.. జగన్ అరెస్ట్ తప్పదా?

YS Jagan: సుప్రీం సీరియస్.. జగన్ అరెస్ట్ తప్పదా?

YS Jagan: నిను వీడని నీడను నేనే.. అన్నట్లు జగన్ వెంట పడుతూనే ఉన్నారు ట్రిపుల్ ఆర్. గతంలో వైసీపీ ఎంపీగా గెలిచి ఆ పార్టీకి చుక్కులు చూపించిన ఆ రెబల్ లీడర్. అప్పట్లోనే జగన్ అక్రమాస్తుల కేసులను టార్గెట్ చేశారు. తాజాగా జగన్‌ అక్రమాస్తుల కేసులపై ఆ ఉండ ఎమ్మెల్యే దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జగన్ కేసుల్లో జరుగుతున్న జాప్యానికి సంబంధించి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టి సీబీఐపై అసహనం వ్యక్తం చేసింది. డిశ్చార్జ్‌ పిటిషన్లకు, ట్రయల్‌కు సంబంధం లేదని కేసుల విచారణ వేగవంతం చేయాలని ఆదేశాలిచ్చి. జగన్‌కు పెద్ద షాక్ ఇచ్చింది.


తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డంపెట్టుకుని అప్పటి కడప ఎంపీ జగన్ అక్రమాస్తులు కూడపెట్టారన్న ఆరోపణలున్నాయి. అతని అక్రమ దందాలపై 2009 నాటి యూపీఏ ప్రభుత్వం. వైఎస్ మరణాంతరం సీబీఐ, ఈడీ విచారణలకు ఆదేశించడంతో కళ్లు తిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి. క్విడ్ ప్రోకో, సూట్‌కేస్ కంపెనీలు, షెల్ కంపెనీలు, మనీ లాండరింగ్ వంటి పదాలు అప్పటి నుంచే పాపులర్ అయి.. ఎవరూ కలలో ఊహించలేని లక్ష కోట్ల రూపాయలు అనే ఫిగర్ అందరికీ షాక్ ఇచ్చింది.

ఆ క్రమంలో జగన్‌పై సీబీఐ 11 కేసులు, ఈడీ 9 కేసులు పెట్టి, చార్జ్ షీట్లు నమోదు చేశాయి. అన్నింట్లో జగన్ ఏ-1 నిందితుడైతే, ఆయన వ్యక్తిగత ఆడిటర్ ఏ-2గా ఉన్నారు. 2011ల ప్రారంభమైన అక్రమాస్తుల కేసుల విచారణకు సంబంధించి జగన్ 2012 మే 27వ తేదీన అరెస్టయ్యారు. దాదాపు 16 నెలలు చెంచల్‌గూడలో జైలు జీవితం గడిపారు. దాదాపు పదేళ్లుగా ఆయన బెయిలుపైనే ఉన్నారు. అయితే ఆయనపై కేసుల విచారణ మాత్రం ఒక్క అడుగూ ముందుకు పడలేదు. జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో ఇప్పటి వరకూ 39 క్వాష్‌ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ చేసి, తీర్పులు ఇవ్వకముందే ఆరుగురు న్యాయమార్తులు బదిలీ అయ్యారు.


Also Read: ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతోంది: జగన్

జగన్ బెయిల్‌పై వచ్చినప్పటి నుంచి పాదయాత్ర, రాజకీయ కార్యకలాపాలు, ఇతరత్రా రకరకా ల కారణాలు, సాకులు చెబుతూ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. సీఎం అయ్యాక.. తాను ప్రజాసేవలో నిరంతరం నిమగ్నమై ఉన్నందువల్ల, భారీ ఆర్థిక లోటుతో ఉన్న ఏపీని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని.. హైదరాబాద్‌ కు రాలేనని పిటిషన్లు సమర్పించారు. కింది కోర్టు ఈ పిటిషన్‌ కూడా తిరస్కరించినప్పటికీ.. హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుని కేసుల విచారణను జాప్యం చూస్తూ వచ్చారు.

కేసుల్లో అసలు విచారణ ప్రారంభం కాకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్ దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్ల ఎత్తుగడ తాజాగా సుప్రీంకోర్టులో చిత్తయింది. డిశ్చార్జి పిటిషన్లకూ, అసలు కేసుల విచారణకూ మధ్య సంబంధం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కేసుల సత్వర విచారణకు ఇదివరకే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని.. కొత్తగా మళ్లీ ఆదేశించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.

విచారణలో ఎందుకు జాప్యం జరుగుతోందో తమకు తెలియడంలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. అదే సమయంలో.. జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ అఫిడవిట్‌లో పొందుపరచిన అంశాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ట్రయల్‌కు డిశ్చార్జ్‌ పిటిషన్లు అడ్డంకి కానేకాదని స్పష్టం చేసింది. సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం విచారణ సాగించాలని ఆదేశించింది.

Also Read: వైసీపీ కీలక నేత, మాజీ డిప్యూటీ సీఎం రాజీనామా

జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణను వేగవంతం చేయాలని, కేసుల ట్రయల్‌ను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని, జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తాను వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడే రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై ఈ ఏడాది మే 2న సీబీఐ అఫిడవిట్‌ వేసింది. కేసుల్లో నిందితులుగా ఉన్నవారు ఒకరి తర్వాత మరొకరు డిశ్చార్జ్‌ పిటిషన్లు వేస్తున్నారని.. ట్రయల్‌ సాగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని.. ఆ కేసుల్లో ఉన్న నిందితులంతా శక్తిమంతులేనని సీబీఐ అందులో పేర్కొంది.

దానిపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. డిశ్చార్జ్‌ పిటిషన్లకు, కేసు విచారణకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం విచారణ చేపట్టాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబరు 11కు వాయిదా వేసింది. సుప్రీం ఆదేశాలతో కేసుల విచారణ ప్రారంభం కానుండటంతో జగన్ తిరిగి కోర్టు మెట్లు ఎక్కడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తమ్మీద జగన్ అక్రమాస్తులు కేసులో ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు.. ఇకపై జరగబోయేది మరో ఎత్తు.. అని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Related News

Palakurthi Politics: ఎర్రబెల్లి యూ టర్న్.. యశస్విని రెడ్డికి షాక్ తప్పదా?

Kadapa MLA: కడప రెడ్డమ్మ కథ రివర్స్..?

BJP Vs BRS: కేసీఆర్‌కు బీజేపీ షాక్! వెనుక స్కెచ్ ఇదే!

Urea War: బ్లాక్ మార్కెట్‌కు యూరియా తరలింపు.? కేంద్రం చెప్పిందెంత..? ఇచ్చిందెంత..?

AP Politics: సామినేని అంతర్మథనం..

Satyavedu Politics: మారిన ఆదిమూలం స్వరం.. భయమా? మార్పా?

Big Stories

×