BigTV English

KTR : మొన్న హరీష్.. నేడు కేటీఆర్.. కాంగ్రెస్ హామీలపై విమర్శలు..

KTR : మొన్న హరీష్.. నేడు కేటీఆర్.. కాంగ్రెస్ హామీలపై విమర్శలు..

KTR : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి వారంరోజులు కూడా కాలేదు. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన రెండురోజులకే రైతు బంధు నిధులు ఇంకా జమ చేయలేందంటూ బీఆర్ఎస్ సీనియర్ లీడర్ హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కేటీఆర్ మరో అడుగు ముందుకేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు సాధ్యంకాదని తేల్చేశారు.


సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్‌ ప్రజలను మభ్యపెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో కేటీఆర్‌ చిట్ చాట్ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఏనాడూ పద్దులపై చర్చ జరగలేదన్నారు. ఏటా కాగ్‌ నివేదికలు ఇస్తున్నారని కేటీఆర్ తెలిపారు. ఏటా ఆడిట్‌ లెక్కలు తీస్తున్నారన్నారు. లెక్కలు వేసుకొని హామీలు ఇస్తారా? హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా? అని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ పాలనలో ఏటా పద్దులపై శ్వేతపత్రం విడుదల చేశామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. గవర్నర్‌ ప్రసంగంలో ఇదే పాత చింతకాయ పచ్చడి చెప్తారని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి కాంగ్రెస్‌కు ఇచ్చారని చెప్తారని పేర్కొన్నారు.


Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×