BigTV English

KTR: కేటీఆర్‌కు అనుకూలించని గ్రహాలు, పవన్‌కు ఓకేనట

KTR: కేటీఆర్‌కు అనుకూలించని గ్రహాలు, పవన్‌కు ఓకేనట

KTR: బీఆర్ఎస్ కొత్త కాన్సెప్ట్ వర్కవుట్ అవుతుందా? అధికార పార్టీని దుమ్మెత్తి పోసేందుకు కేటీఆర్ ప్రయార్టీ ఇస్తున్నారా? మళ్లీ అధికారంలోకి వస్తామని పైకి ధీమా చెబుతున్నా.. లోపల ఆ సీన్ లేదంటున్నారా? ముఖ్యమంత్రి కావాలని కేటీఆర్ భావిస్తున్నాడా? ముఖ్యమంత్రి పీఠం ఆయనకు అందని దాక్షేనా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


కాంగ్రెస్ సర్కార్ తనను అరెస్ట్ చేస్తే మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయ మంటూ కారు పార్టీ నేతలు ఊదర గొడుతున్నారు. సింపుల్ గా చెప్పాలంటే ఈ విధంగా కేడర్‌ని ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి గతంలో జరిగిన కొన్ని విషయాలు గుర్తు చేస్తున్నారు.

గతంలో అరెస్టయి జైలుకి వెళ్లిన నేతలంతా ముఖ్యమంత్రులు అయిన సందర్భాలు తెలుగు రాష్ట్రాల్లో అధికంగా ఉన్నాయని అంటున్నారు. వారిలో జగన్, చంద్రబాబు, రేవంత్‌రెడ్డి వంటి నేతలు వివిధ సందర్బాల్లో అరెస్టయ్యారు. ఆ తర్వాత ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రులు అయ్యారు.


కేటీఆర్ అరెస్టయితే, ఆ తర్వాత పాదయాత్ర పేరిట ప్రజల్లోకి వెళ్తారని అంటున్నారు. ఈ రెండూ ఆయన వ్యక్తిగత ఇమేజ్‌ని అమాంతంగా పెంచుతుందని నమ్మేవాళ్లు లేకపోలేదు. కాకపోతే సంఖ్యాశాస్త్ర ప్రకారం కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అదృష్టం లేదన్నది ఆ పార్టీలో కొందరు నేతల మాట.

ALSO READ: పంచాయతీ నగారా.. మోగేది ఎప్పుడంటే.?

దీనిపై కొందరు సంఖ్యాశాస్త్ర నిపుణులు కొత్త విషయాలను తెరపైకి తెచ్చారు. ఇంగ్లీష్‌లో (ChANdrababu, RevANth reddy, ChANdrasekhar, JagAN,PawAN kalyAN) కొన్ని పేర్లను బయటపెట్టారు. పై నేతల పేర్లలో ఏఎన్ అనేది అందరికీ కామన్‌గా ఉందని, వాళ్లంతా ముఖ్యమంత్రులు అయ్యారని, ప్రస్తుతం కొనసాగుతున్నారని అంటున్నారు.

కేటీఆర్‌కు అలాంటి అదృష్టం లేదని ఓపెన్‌గా చెప్పేస్తున్నారు. ఈ విషయం తెలియగానే డీలా పడిపోవడం బీఆర్ఎస్ హార్డ్ కోర్ అభిమానుల వంతైంది. తాము కష్టపడినా ఫలితం దక్కదని తెలిసి వాపోతున్నారు. ఈ విషయంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌‌కు సానుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు.

ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్షం లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. పైగా కేంద్రంలోని బీజేపీ పెద్దలు సైతం పవన్ కల్యాణ్‌కు ప్రయార్టీ ఇస్తున్నారు. రీసెంట్‌గా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించడం దీనికి మరొక కారణంగా చెబుతున్నారు.

కూటమి సర్కార్‌ని ఎదుర్కోలేక నానాకష్టాలు పడుతోంది ఫ్యాన్ పార్టీ. ఒక్కమాటలో చెప్పాలంటే సమస్యలన్నీ ఆ పార్టీని చుట్టుముట్టాయి. ఈలోగా ఆ పార్టీ నేతలు తలోదారి చూసుకుంటున్నారు. వైసీపీలోకి ముఖ్యనేతలు జనసేన వైపు చూస్తున్నారు.. చూశారు కూడా.

ఇప్పటికిప్పుడు కాకపోయినా పదేళ్ల తర్వాతైనా బీజేపీతో కలిసి జనసేన పోటీ చేస్తే పవన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమనేది కొందరి నేతల మాట. సంఖ్యా శాస్త్రం ఓకే.. నాయకుడు అనేవాడు ప్రజల్లోని రావాలని అంటున్నారు. కేవలం మీడియా ముందుకొచ్చి నిత్యం వార్తల్లో కనిపించాలనుకోవడం అత్యాశే అవుతుందని అంటున్నారు.

దీనికితోడు అదృష్టం కలిసిరావాలని అంటున్నారు. లేకుంటే తలకిందులుగా తపస్సు చేసినా ముఖ్యమంత్రి కావడం కష్టమని అంటున్నారు. బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కు అయ్యిందని, అందుకే ఎంపీ ఎన్నికల్లో కమలానికి మద్దతు ఇచ్చారని అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలసి పోటీ చేసినా కేటీఆర్‌కు సీఎం కుర్చీ అందని దాక్షేనన్నమాట.

Related News

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Hyderabad Cloudburst: డేంజర్.. హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్.. ఆకస్మిక వరద ముప్పు.. జాగ్రత్త!

Hyderabad Rain Alert: నగర ప్రజలు అలర్ట్.. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు

KTR on Police: మా సబితమ్మ మీదే మాటలా.. పోలీసులకు కేటీఆర్ మాస్ వార్నింగ్

Big Stories

×