E-Paper
Advertisement

సీఎంతో సహా మంత్రుల అవినీతి చిట్టా విప్పుతా.. రాజగోపాల్ రెడ్డి సంచలన స్కెచ్?

సీఎంతో సహా మంత్రుల అవినీతి చిట్టా విప్పుతా.. రాజగోపాల్ రెడ్డి సంచలన స్కెచ్?
Advertisement

Komatireddy Rajagopal: గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే తనకు కేబినెట్ లో బెర్త్ ఖాయమనుకున్నారు కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి.బిజెపి నుండి కాంగ్రెస్ లో చేరిన సమయంలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ నాయకత్వం భరోసా ఇచ్చిందని ఎమ్మెల్యే వర్గీయులు అంటున్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తోన్నా ఇంత వరకు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. తన అసంతృప్తిని పలు సందర్భాల్లో అసహన రూపంలో ఎక్స్ ప్రెస్ చేశారు రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలూ చేస్తూ వచ్చారు. అయితే రేవంత్ తో విబేధాలు ఉన్నప్పటికీ ఇటీవల నకిరేకల్ లో జరిగిన సిఎం బహిరంగ సభకు రాజగోపాల్ రెడ్డి హాజరు కావడంతో ఇద్దరి మధ్యా అంతా సద్దుకుందనే అందరూ అనుకున్నారు. అయితే రేడియల్ రోడ్ టెండర్ల అంశం ఈ ఇద్దరి మధ్య చిచ్చు రేపుతోందన్న ప్రచారం జరుగుతోంది.

రాజగోపాల్ రెడ్డి ఫైర్..

రేడియల్ రోడ్ టెండర్లలో అంచనా వ్యయం కన్నా ఎక్కువ ధరకు బిడ్ దాఖలు చేసిన కంపెనీలకు పనులు అప్పగించడం పై రాజగోపాల్ రెడ్డి ఫైర్ అవుతున్నట్లు సమాచారం. ఈ టెండర్ల నుంచి రాజగోపాల రెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్ ఫ్రా సంస్థను ఉద్దేశపూర్వకంగా తప్పించారని రాజగోపాల్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారట.తనను రాజకీయంగా అణచివేసేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబ సంస్థను టెండర్ల నుంచి తప్పించారని కోమటిరెడ్డి ఫీల్ అవుతున్నారట.రాజకీయంగా ఆర్ధికంగా తన మూలాలను దెబ్బతీసే కుట్రగా రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు. అధిక ధరలకు టెండర్లు కేటాయించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు 600 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లుతుందని రాజగోపాల్ రెడ్డి ఆరోపిస్తున్నారట.

అవినీతి చిట్టాను బహిర్గతం..

Advertisement

2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒరిజనల్ కాంగ్రెస్ నేతలకు అన్యాయం జరుగుతోందని..మంత్రి పదవులతో పాటు కీలక పదవులు బయటి నుంచి వచ్చిన వారికే కట్టబెడుతున్నారని గతంలోనే రాజగోపాల్ రెడ్డి సంచలన ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే. టెండర్ల ముసుగులో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని రాజగోపాల్ రెడ్డి కుత కుత లాడిపోతున్నారట. ముఖ్యమంత్రితో పాటు మంత్రులకు సంబంధించిన అవినీతి చిట్టాను బహిర్గతం చేయాలన్న స్కెచ్ తో రాజగోపాల్ రెడ్డి ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.

Also read: కోలుకున్న భారత రూపాయి విలువ.. ఆర్‌బీఐ సంచలన నిర్ణయం?

Tags

Related News

పెట్రోల్ ధరల మానిటరింగ్ కోసం.. యూకే ప్రభుత్వం సరికొత్త పథకం!

వైఎస్ ఫ్యామిలీ కంచుకోటలో రసవత్తర పోరు.. కొత్త రిజర్వేషన్లతో కడపలో కలవరం!

సీఎం రేవంత్ వ్యూహానికి తట్టుకోలేకపోతున్నారా.. సిరిసిల్ల, సిద్దిపేటలో మారుతున్న పొలిటికల్ సీన్?

పాముతో పెళ్లి, నదిలో అద్భుతం.. బతుకమ్మ పాటల్లో ఆ పేర్లలో ఉన్న రహస్యం ఇదే!

పుష్కరకాలంలో యువత యూటర్న్‌..! మోడీ అప్పుడు కొత్త ఓటర్ల పాలిట హీరో..! అందుకే నెత్తినెత్తుకున్నారు.. ఇప్పుడెందుకు వైఖరి మారింది? సీఎస్‌డీఎస్‌ ఆసక్తికర విశ్లేషణ..!

బీజేపీలో బతుకమ్మ రాజకీయ మంటలు.. మరోసారి భగ్గుమన్న నేతల ఆధిపత్య పోరు!

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోరుకు సీపీఎం పార్టీ సై.. ఈ జిల్లాలపై స్పెషల్ ఫోకస్!

Big Stories

Advertisement
×