Bigg Boss 10 : బిగ్ బాస్ సీజన్ 10 కోసం అభిమానులు, టీవీ ప్రేక్షకులు, సినీ లవర్స్ కూడా ఎంత ఆసక్తిగా ఎదురు చూశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎట్టకేలకు సెప్టెంబర్ 6వ తేదీన గ్రాండ్గా సీజన్ 10 ప్రారంభం అయింది. ఎప్పటిలాగే నాగార్జున (Nagarjuna) హోస్ట్ గా బాధ్యతలు చేపట్టారు. మొత్తం 10 మంది సెలబ్రిటీలు అగ్నిపరీక్ష సీజన్ 2 ద్వారా, 6 మంది కామనర్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇకపోతే ఈసారి కూడా కామనర్స్ ను ఎప్పటిలాగే సెలబ్రిటీలు టార్గెట్ చేస్తూ చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విమర్శలకు దారితీస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా త్రిగుణ్ వర్సెస్ రోహిత్ నాయుడు అన్నట్టుగా షో నడుస్తోంది. ముఖ్యంగా రోహిత్ నాయుడు ను సెలబ్రిటీలంతా టార్గెట్ గా చేసుకొని కామెంట్లు చేయడం అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇదంతా ఇలా ఉండగా ఎవరు ఊహించని విధంగా మొదటి వారమే మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టి ఆడియన్స్ కు షాక్ ఇచ్చిన బిగ్ బాస్. ఇప్పుడు ఏకంగా రెండవ కంటెస్టెంట్ ను కూడా ఎలిమినేట్ చేసి మరో షాక్ ఇచ్చారు. బిగ్ బాస్ 10 ఎవరి ఊహకు అందదు అని చెప్పి మరీ ఈ రేంజ్ ప్లానింగ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రేక్షకుల ఓటింగ్ తో పాటు కంటెస్టెంట్స్ ఓటింగ్ పెట్టి ఎలిమినేట్ చేస్తున్నాడు బిగ్ బాస్ .. అందులో భాగంగానే ఆర్ జె చరణ్ మొదటి వారంలో మిడ్ వీక్ ఎలిమినేట్ కాగా ఇప్పుడు రెండవ కంటెస్టెంట్ గా లేడీ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. మరి ఆ లేడీ కంటెస్టెంట్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
also read:స్వయంభు’ వెనుక సంయుక్త కష్టం.. వీడియో వైరల్!
హౌస్ లోకి అడుగుపెట్టిన 16 మంది కంటెస్టెంట్స్ ని బ్లూ, రెడ్ టీమ్స్ గా విభజించి.. గేమ్స్ పెడుతున్న బిగ్ బాస్.. అలా హై రిస్క్ జోన్ లోకి వచ్చి తక్కువ ఓట్లు పొందిన ఆర్జే చరణ్ ను బయటకు పంపించేశాడు.. ఇప్పుడు హై రిస్క్ జోన్ లో కామనర్ నుండి అమన్, సెలబ్రిటీల నుంచి సుదీర్, చైత్ర వచ్చినట్లు తెలుస్తోంది. వీళ్ళ ముగ్గురిలో ఈసారి సీరియల్ నటి చైత్రకు తక్కువ మంది సపోర్ట్ చేయడంతోనే ఈమె ఎలిమినేట్ అయినట్లు సమాచారం. అయితే ఇక్కడ బిగ్ బాస్ మరో ప్లాన్ ఏమిటంటే వీరిద్దరిని మళ్లీ హౌస్ లోకి తీసుకురాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తర్వాత వీళ్ళిద్దరి మధ్య పోటీ పెట్టి వీళ్ళల్లో ఒకరిని ఈ ఆదివారం నిజంగానే ఎలిమినేట్ చేయనున్నారట. మరి మొదటివారం ఎలిమినేట్ కాబోతున్న ఆ దురదృష్టవంతులు ఎవరు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా బిగ్ బాస్ సీజన్ 10 ఎవరి ఊహకు అందని సరికొత్త ట్విస్టులు, టాస్క్ లతో షోను మరింత రక్తి కట్టిస్తున్నారు నిర్వాహకులు.
ఇదిలా ఉండగా మరొకవైపు బిగ్ బాస్ సీజన్ 10 లోకి వైల్డ్ కార్డు ద్వారా ఏకంగా 8 మంది హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరు కామనర్స్ హౌస్ లోకి అడుగుపెడుతుండగా.. 6 మంది సెలబ్రిటీలను ఎంపిక చేశారట. ఇప్పటికే చర్చలు జరగగా.. వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే వైల్డ్ కార్డు ఎంట్రీస్ కూడా ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.