E-Paper
Advertisement

చర్చకు రాకుండా మంత్రులు పారిపోయారన్న కేటీఆర్, మరొక ఛాలెంజ్ విసిరిన మంత్రి జూపల్లి

చర్చకు రాకుండా మంత్రులు పారిపోయారన్న కేటీఆర్,  మరొక ఛాలెంజ్ విసిరిన మంత్రి జూపల్లి
Advertisement

Hyderabad: బీఆర్ఎస్‌తో చర్చకు సిద్ధమని సవాల్ విసిరిన మంత్రులు మరోసారి పారిపోయారని విమర్శించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మంత్రి జూపల్లి వస్తానని చెప్పి తోక ముడిచారని, సందట్లో సడేమియా అంటే ఇదేనని అన్నారు. తాము గురువారం ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్‌కు వచ్చామని, మంత్రి జూపల్లి రాలేదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ ఫైర్

Advertisement

గన్ పార్క్‌కు బయలుదేరిన హరీష్‌రావు, ఇతర నేతలను గేటు దాటకుండానే అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు. బీఆర్ఎస్‌తో చర్చ అంటే భయం ఎందుకని ప్రశ్నించారు. దమ్ముంటే వెంటనే ప్రత్యేక అసెంబ్లీ పెట్టాలని సవాల్ విసిరారు. 30 నెలల మీ పాలనలో చేసిన దగా, మోసం వైఫల్యలతోపాటు అన్ని అంశాలపై చర్చిద్దామన్నారు.

ప్రభుత్వానికి చర్చించే దమ్ము లేదని, చేతకాని వాళ్లు ఎందుకు సవాళ్లు చేశారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల ముందు అన్ని వాస్తవాలు ఉంచాలని తాము భావించామని, సవాళ్లు స్వీకరించే సత్తా ముఖ్యమంత్రి, మంత్రులకు లేదని మరోసారి తేలిపోయిందన్నారు. అప్పులు, గురుకులాల్లో అవినీతిపై చర్చకు తాము సిద్ధమేనని పునరుద్ఘాటించారు.

Advertisement

చర్చకు రాకుండా మంత్రులు పారిపోయారని ఎద్దేవా

సవాల్ చేసిన కాంగ్రెస్ మంత్రులు వెనక్కి తగ్గారని ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్‌కు వస్తానని చెప్పి గన్‌పార్క్‌కు వెళ్లడం ఎందుకని సూటిగా ప్రశ్నించారు. సవాళ్లు విసరడమేకాదు.. వాటిని నిలబెట్టుకునే ధైర్యం ఉండాలన్నారు.

ఇదిలా వుండగా గన్‌పార్క్ వద్ద మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. తాను సవాల్ కేటీఆర్-హరీశ్‌రావులకు కాదన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌కు విసిరానని, తాను చెప్పిన అప్పుల లెక్కలు తప్పని నిరూపిస్తే మంత్రి పదవితోపాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని మరొక సవాల్ విసిరారు.

గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలపై చర్చకు సిద్ధమేనన్నారు. రూ.7.3 లక్షల కోట్ల అప్పులు చేసిందని మంత్రి, అందులో ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.74వేల కోట్ల అప్పు చేసిందన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని, తాము అప్పులు చేయలేదని కేసీఆర్‌ చెప్పాలన్నారు. తాను చెప్పింది అబద్ధమైతే రాజీనామా చేసేందుకు సిద్ధమేనన్నారు.

ALSO READ: తెలంగాణ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు.. ఎలాగో తెలుసా?

తాము చేసిన ఆరోపణలపై కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు మంత్రి జూపల్లి. తన వద్ద రికార్డులు ఉన్నాయని అన్నారు. హరీశ్‌రావు, కేటీఆర్‌ ఇంకా బుకాయిస్తున్నారని, బీఆర్‌ఎస్‌ చేసిన అప్పులను కేసీఆర్‌ మీడియాకు చెప్పాలన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రతీ నెలా రూ.6వేల కోట్ల వడ్డీ కడుతున్నామని తెలియజేశారు.

Related News

తెలంగాణ సివిల్ సప్లై‌లకు బిగ్ షాక్.. రైస్ మిల్లుల ఆడిట్‌లో దొరికిపోయిన మాజీ ఎమ్మెల్యే!

మెడికల్ ఆఫీసరే డ్యూటీకి రాకపోతే ఎలా.. యూపీహెచ్‌సీలో బయటపడ్డ నిర్లక్ష్యం!

మేడ్చల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా.. ‘శక్తి’ స్కీమ్‌ను రద్దు చేయాలని డిమాండ్!

22ఏ భూ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్.. కలెక్టర్‌ మను చౌదరి కీలక ఆదేశాలు జారీ!

22ఏ భూముల వివాదానికి చెక్.. సబ్‌రిజిస్ట్రార్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!

ప్రిన్సిపాల్ రూపారెడ్డిని ఆ విద్యార్థులు అందుకే చంపారు.. యూట్యూబ్‌లో చూసి మరీ..

నర్సంపేట్‌లో తీవ్ర ఉద్రిక్తత.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్!

డైపర్ వేసుకుని తిరిగే రేవూరికి టికెట్ ఎలా ఇస్తావ్..సీఎం రేవంత్ రెడ్డి పై కొండా సుస్మిత ఫైర్!

Big Stories

Advertisement
×