E-Paper
Advertisement

ఓటీటీ అలర్ట్… ‘ప్రేమలు’ మలయాళం, హిందీ వెర్షన్లు డిలీట్… తెలుగులో ఏ ఓటీటీలో ఉందంటే ?

ఓటీటీ అలర్ట్… ‘ప్రేమలు’ మలయాళం, హిందీ వెర్షన్లు డిలీట్… తెలుగులో ఏ ఓటీటీలో ఉందంటే ?
Advertisement

Premalu OTT Update: ఒక సినిమా సూపర్ హిట్ అయితే థియేటర్లలోనే కాదు, ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూస్తుంటారు. కానీ అదే సినిమాను మరో భాషలో రీమేక్ చేస్తున్న సమయంలో… ఒరిజినల్ సినిమానే ఓటీటీ నుంచి అకస్మాత్తుగా మాయమైతే ? ఇప్పుడు మలయాళ సూపర్ హిట్ ‘ప్రేమలు’ (Premalu) విషయంలో ఇదే జరుగుతోంది. హిందీలో ఈ సినిమాను ‘ప్రేమ్ కీటాను’ (Prem Keetanu) పేరుతో రీమేక్ చేస్తున్న నేపథ్యంలో… జియోహాట్‌స్టార్‌లో ఉన్న మలయాళంతో పాటు హిందీ, తమిళ వెర్షన్లు కనిపించకుండా పోయాయి. దీంతో అసలు ఈ సినిమాను ఎందుకు తొలగించారు ? రీమేక్‌కు దీనికి సంబంధం ఉందా ? మరి తెలుగు వెర్షన్ పరిస్థితి ఏంటి ? అనే టాక్ మొదలైంది నెట్టింట్లో.

విషయం ఏమిటంటే ?

నస్లెన్, మమితా బైజు జంటగా నటించిన ‘ప్రేమలు’ చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్. క్యూట్ లవ్ స్టోరీ, కామెడీ, ఫ్రెండ్‌షిప్, సహజమైన పాత్రలతో యూత్‌ను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగు వెర్షన్‌కు కూడా ఊహించని స్థాయిలో మంచి స్పందన వచ్చింది. థియేటర్లలోనే కాదు, ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఈ సినిమాను విపరీతంగా చూశారు. ఇలాంటి సమయంలో ‘ప్రేమలు’ను బాలీవుడ్‌లో ‘ప్రేమ్ కీటాను’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. వీర్ పహారియా, అపర్‌శక్తి ఖురానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు.

Advertisement

ఆగస్టు 17న హిందీ రీమేక్ ట్రైలర్ విడుదలైన కొద్దిసేపటికే జియోహాట్‌స్టార్‌లో మరో ట్విస్ట్ కనిపించింది. అందులో ఉన్న ‘ప్రేమలు’ ఒరిజినల్ మలయాళ వెర్షన్‌తో పాటు హిందీ, తమిళ డబ్బింగ్ వెర్షన్లు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో సోషల్ మీడియాలో అసలు హాట్ స్టార్ ఇలా చేయడానికి గల కారణం ఏంటి ? అనే చర్చ మొదలైంది. రీమేక్ విడుదలకు ముందు ప్రేక్షకులు ఒరిజినల్ కథను చూడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారా ? లేక కొత్త సినిమాపై ఆసక్తి పెంచడంలో భాగంగానే ఒరిజినల్ వెర్షన్లను తాత్కాలికంగా తొలగించారా ? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

తెలుగులో ఏ ఓటీటీలో చూడవచ్చు ?

ఇదిలా ఉంటే తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఓ గుడ్ న్యూస్ ఉంది. జియోహాట్‌స్టార్‌లో మిగతా వెర్షన్లు కనిపించకపోయినా తెలుగు వెర్షన్ మాత్రం ఆహాలో అందుబాటులోనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సినిమాను గీతా ఆర్ట్స్ విడుదల చేయగా, డిజిటల్ హక్కులు ఆహా వద్ద ఉండటంతో జియోహాట్‌స్టార్‌లో జరిగిన మార్పు తెలుగు వెర్షన్‌పై ప్రభావం చూపలేదని తెలుస్తోంది.

Advertisement

హిందీ రీమేక్ థియేటర్లలోకి వచ్చే వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందా? ఒరిజినల్ వెర్షన్లు మళ్లీ జియోహాట్‌స్టార్‌లోకి వస్తాయా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి రీమేక్ కారణంగా ఒరిజినల్ వెర్షన్లు ఓటీటీ నుంచి మాయమవడం.. తెలుగు వెర్షన్ మాత్రం సేఫ్‌గా ఉండటం ‘ప్రేమలు’ విషయంలో కొత్త చర్చకు తెరలేపింది.

Read Also: తల్లిదండ్రుల ప్రేమకథ వెనుక ఎయిడ్స్ విషాదం… ఈ అమ్మాయి తెలుసుకున్న నిజం కదిలిస్తుంది మావా

Tags

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×