BigTV English

Lavanya Tripathi Athamma’s Kitchen: లావణ్య త్రిపాఠి చేసిన పనికి అత్తమ్మాస్ కిచెన్‌పై విమర్శలు.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

Lavanya Tripathi Athamma’s Kitchen: లావణ్య త్రిపాఠి చేసిన పనికి అత్తమ్మాస్ కిచెన్‌పై విమర్శలు.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

Lavanya Tripathi Athammas Kitchen: మెగాస్టార్ ఫ్యామిలీకి ప్రజల్లో మంచి పేరు ఉంది. వారంతా విడివిడిగా కాకుండా కలిసి మెలిసి ఉండటంతో వారి ప్రేమానురాగాలకు అభిమానులు, ప్రేక్షకులు ఫిదా అయిపోతారు. ఇదంతా ఇంటికి పెద్ద దిక్కు అయిన చిరంజీవి వల్లే అని చెప్పొచ్చు. బేస్‌మెంట్ స్ట్రాంగ్‌గా ఉంటే.. పిల్లర్స్ అంతే స్ట్రాంగ్‌గా ఉంటాయి అనడానికి మెగా ఫ్యామిలీనే నిదర్శనం. మెగాస్టార్ తన తల్లి, భార్య, పిల్లలు, మనవల్లు, అన్న దమ్ములపై చూపించే ప్రేమ అంతా ఇంతా కాదు.


ఇక ఆయన మాదిరిగానే చిరంజీవి తర్వాత తరం వారు కూడా నెట్టికొస్తున్నారు. అయితే ఇదిలా ఉంటే మరి ఇంట్లో ఉండే మగవారితో పాటుగానే ఆ ఇంటి ఆడవాళ్లు కూడా బిజినెస్ పరంగా దూసుకుపోతున్నారు. అందులోనూ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన ముందు వరుసలో ఉన్నారు.

ఇటీవలే ఉపాసన తన అత్తమ్మ సురేఖ బర్త్ డే రోజున ‘అత్తమ్మాస్ కిచెన్’ అనే పేరుతో ఓ పచ్చడ్ల ఆన్‌లైన్ బిజినెస్ పెట్టింది. గుమ గుమలాడే రుచులతో అచ్చం ఇంట్లో చేసుకునే ఆవకాయలా తయారు చేసి ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల చిరంజీవి తల్లి అంజనాదేవి, ఆయన భార్య సురేఖ ఉపాసన కలిసి ఆవకాయను తయారు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.


Also Read: చిరంజీవి భార్య సురేఖ ఆవకాయ పచ్చడి చేయడం.. ఉపాసన వీడియో తీయడం ఎంత బాగుందో..!

అందులో చిరు భార్య సురేఖ ఆవకాయ తయారు చేస్తుంటే.. అంజనా దేవి చూడటం.. వాటంతటినీ ఉపాసన వీడియో తీసి షేర్ చేసింది. ఆ వీడియో నెట్టింట బాగా వైరల్ అయింది. దీంతో ఆ వీడియో చూసిన నెటిజన్లు.. ఆ ఫ్యామిలీ అంతగా కలిసి మెలిసి ఉండటాన్ని చూసి మురిసిపోయారు. అయితే తాజాగా అత్తమ్మాస్ కిచెన్ ఇన్‌స్టా పేజీ నుంచి మరొక కొత్త పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్‌లో లావణ్య త్రిపాఠి, నాగబాబు భార్య పద్మ కలిసి ఆవకాయ్ తయారు చేస్తున్నట్లు కనిపించారు. అయితే అలా ఇద్దరూ కలిసి ఆవకాయ్ కలుపుతూ దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేయగా.. చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇందులో భాగంగా అత్తమ్మాస్ కిచెన్స్ ప్రొడక్టులపై విమర్శలు చేశారు. అలా జుట్టు విరబూసుకుని.. చేతులకు గ్లౌస్‌లు పెట్టుకోలేదని.. ఏ మాత్రం క్వాలిటీ మెయింటైన్ చేయడం లేదంటూ కామెంట్లు కురిపించారు. అయితే ఈ విషయంపై అత్తమ్మాస్ కిచెన్స్ టీం రియాక్ట్ అయింది. అలా తయారు చేస్తున్న ఆవకాయ్ అమ్మడానికి కాదని.. ఇంట్లో వారికోసం చేస్తున్నట్లు రిప్లై ఇచ్చింది. అత్తమ్మస్ కిచెన్స్ కోసం తయారు చేసేటప్పుడు చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తామని చెప్పుకొచ్చింది. దీంతో మరి అత్తమ్మాస్ కిచెన్స్ పేజీలో స్టాక్ లిమిటెడ్ అని చెబితే ఎవ్వరైనా అలానే అనుకుంటారు కదా? అని నెటిజన్ల స్పందిస్తున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×