BigTV English

Telangana Phone Tapping case: ఇద్దరు అధికారులకు ఐదురోజుల కస్టడీ, పరారీలో ఆ వ్యాపారులు..!

Telangana Phone Tapping case: ఇద్దరు అధికారులకు ఐదురోజుల కస్టడీ, పరారీలో ఆ వ్యాపారులు..!
Phone tapping case
Phone tapping case

Telangana Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును అరెస్ట్ చేసిన పోలీసులు, మిగతావారిపై దృష్టి పెట్టారు. మరో ముగ్గురు అధికారులు విదేశాలకు వెళ్లినట్టు భావించిన అధికారులు.. వారిపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు.


గురువారం ఉదయం మాజీ డీసీసీ రాధాకిషన్‌రావు ఇంటికి పోలీసులు వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ అంశంలో ప్రణీత్‌రావుకు రాధా‌కిషన్‌రావు ఇచ్చిన ఆదేశాలపై పోలీసులు విచారించారు. ముఖ్యంగా ఫోన్‌ట్యాపింగ్ సమాచారంతో ఎక్కడెక్కడ ఆపరేషన్ చేపట్టారు? హవాలా లావాదేవీల క్రమంలో ఏం జరిగింది? వ్యాపారులను బెదిరించి అక్రమంగా డబ్బు సంపాదించారన్న ఆరోపణలపై గుచ్చిగుచ్చి ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

అటు రాధాకిషన్‌రావు, గట్టుమల్లును పోలీసులు విచారిస్తున్న క్రమంలో బేగంబజార్‌లో కొందరు వ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. అప్పట్లో టాస్క్‌ఫోర్స్ తరచూ బేగంబజార్‌లో సోదాలు నిర్వహించేది. ఆ ప్రాంతంలో గంజాయి, హవాలా దందాల్లో ప్రమేయమున్న వ్యాపార సంస్థలపై దాడులు చేశారు. ఈ క్రమంలో కొందరు వ్యాపారులతో టాస్క్‌ఫోర్స్ అధికారులతో రిలేషన్ ఏర్పడిందనే ప్రచారమూ లేకపోలేదు. రాధాకిషన్‌రావు, గట్టుమల్లులను విచారిస్తున్న విషయం బయటకు రాగానే ఈ వ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం.


Also Read: Phone tapping case Update: ట్యాపింగ్ వెనుక లోగుట్టు.. ఆ విధంగా ప్రత్యర్థులను..!

హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌లో సుధీర్ఘంగా పనిచేసిన రాధాకిషన్‌రావుతోపాటు ఆయన టీమ్‌పై పలు ఆరోపణ లు ఉన్నాయి. ఆయన మల్కాజ్‌గిరి ఏసీపీగా ఉన్న సమయంలో ఓ కాంగ్రెస్ నేత ఆత్మహత్యకు కారణమయ్యారనే అభియోగాలు ఎదుర్కొన్నారు. విచారణ తర్వాత ఆ కేసు నుంచి బయటపడ్డారు. ఉద్యోగ విరమణ తర్వాత రెండు విడతలుగా ఆయనే ఓఎస్డీగా కొనసాగడం వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉన్నాయనే వార్తలు లేకపోలేదు.

అయితే శాసనసభ ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో రాధాకిషన్‌రావుపై అప్పటి కమిషనర్ సందీప్ శాండిల్య ఎన్నికల కమిషనర్‌కు ప్రత్యేక నివేదిక పంపడంతో ఆయనను టాస్క్‌ఫోర్స్ బాధ్యతల నుంచి తప్పించారు. ప్రభుత్వం మారడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఇదిలావుండగా మరో ముగ్గురు టాస్క్‌ఫోర్స్ పోలీసులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారి ఫోన్లను అధికారులు స్వాధీనం చేశారు. క్షేత్రస్థాయి ఆపరేషన్లలో వీరి ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో వారిని కూడా విచారిస్తున్నట్లు సమాచారం.

Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. దేశంలో తొలి కేసుగా గుర్తింపు

ఇక ప్రణీత్‌రావుకు డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తితోపాటు ఓ కానిస్టేబుల్ సైతం పోలీసుల అదుపులో వున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డిసెంబర్ నాలుగున ఎస్ఐబీలో హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేయడంతోపాటు వాటిని మూసీ నదిలో పారేయడం వెనుక వీరి ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను ఐదురోజుల పోలీసుల కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం నుంచి ఏప్రిల్ రెండు వరకు కస్టడీ విధించింది.

Tags

Related News

Weather News: అత్యంత భారీ వర్షాలు.. డేంజర్ జోన్‌లో ఈ జిల్లాలు.. బయటకు వెళ్లొద్దు

Hyderabad Rains Today: కుమ్మేస్తున్న వరుణుడు.. ఇళ్లల్లో ఉండటమే బెటర్, ఈ ఏరియాలు జలమయం

Telangana politics: కారులో భారీ కుదుపు.. కమలం గూటికి మాజీలు, బీఆర్ఎస్ తర్వాత ప్లానేంటి?

Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో హైఅలర్ట్! బాంబ్ స్క్వాడ్ ప్రత్యేక తనిఖీలు.. ఎందుకంటే..

Telangana Rains: వర్షాల ఎఫెక్ట్.. ఈ ఐదు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు

Telangana Government: రాష్ట్ర అభివృద్ధిపై సీఎం రేవంత్ ఫోకస్.. నలుగురు మంత్రులతో కమిటీ

Big Stories

×