
Minister KTR comments on Elections(Latest political news telangana):
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 10లోపు నోటిఫికేషన్ వస్తేనే సమయంలోపు ఎన్నికలు జరుగుతాయన్నారు. సమయంలోగా నోటిఫికేషన్ వచ్చేది అనుమానంగా ఉందన్నారు. తెలంగాణ ఎన్నికలు కూడా ఏప్రిల్ లేదా మేలో జరగొచ్చాన్నారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై క్లారిటీ వచ్చే అవకాముందన్నారు మంత్రి కేటీఆర్. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ స్పెషల్ సెషన్ జరగనుంది. ఈ మీటింగ్స్ ఎజెండాపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అయితే కేంద్రం సంచలన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ సెషన్ ఏర్పాటు చేసిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జమిలి ఎన్నికలపైనా మరోవైపు చర్చ నడుస్తోంది. ఈ సమయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.
2018 డిసెంబర్ 7న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 11 ఫలితాలు వెల్లడయ్యాయి. 2018 డిసెంబర్ 13న కేసీఆర్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. గడువు ప్రకారం ఈ డిసెంబర్ లో ఎన్నికలు జరగాలి. అక్టోబర్ రెండోవారం ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అంతా భావిస్తున్నారు. కానీ ఈ సమయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఎన్నికల ఎప్పుడు జరుగుతాయనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.