
YS Jagan mohan reddy latest news(Andhra pradesh political news today) :
సీఎం జగన్ ఢిల్లీ టూర్ వార్త ఏపీ రాజకీయాల్లో మరింత వేడిని పెంచుతోంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్టు చేయడంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ సమయంలో జగన్ హస్తిన పర్యటన మరింత చర్చనీయాంశమైంది.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో సీఎం జగన్ విదేశాల్లో ఫ్యామిలీ ట్రిప్ లో ఉన్నారు. ఆయన లండన్ పర్యటన ముగించుకుని సోమవారమే ఏపీకి చేరుకున్నారు. లండన్ నుంచి రాగానే జగన్ ఢిల్లీకి వెళ్లేందుకు రెడీ కావడం పొలిటికల్ హీట్ ను మరింత పెంచుతోంది. ఏపీ సీఎం బుధవారం హస్తినకు వెళతారని తెలుస్తోంది. రెండ్రోజులపాటు అక్కడే ఉంటారని సమాచారం.
ఢిల్లీలో ప్రధాని మోదీతో జగన్ భేటీకానున్నారని తెలుస్తోంది. మరి మీట్ లో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం చర్చకు వస్తుందా? ఈ కేసుపై మోదీకి జగన్ బ్రీఫింగ్ చేయనున్నారా? అనే అంశం ఆసక్తిగా మారింది. అలాగే కొంతమంది కేంద్ర మంత్రులను జగన్ కలుస్తారని అంటున్నారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులకు మద్దతు ఇచ్చే అంశంపై చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ ఢిల్లీ బాట పడుతున్నారనే సందేహాలు కలుగుతున్నాయి.
ఇటీవలే తన కూతళ్లను కలిసేందుకు సీఎం జగన్ లండన్ వెళ్లారు. ఆయన లండన్‌లో ఉండగానే చంద్రబాబు అరెస్ట్ జరిగింది. జగన్ అక్కడ నుంచే చక్రం తిప్పుతూ..కుట్రలు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్లాన్ ప్రకారమే ఆయన లండన్ టూర్ షెడ్యూల్ పెట్టుకున్నారని ఆరోపించారు. అంతా అయిపోయగానే ఏమీ ఎరగనట్టు.. తనకేమీ సంబంధం లేనట్టు ఏపీకి వచ్చారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రజల్లో తనపై ఎలాంటి చెడు ప్రభావం కలగకూడదనే వ్యూహంతోనే పక్కా ప్లాన్ ప్రకారమే జగన్ వ్యవహరించారన్న ప్రచారం సాగుతోంది.