E-Paper
Advertisement

చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేటీఆర్, తలసాని

చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేటీఆర్, తలసాని
Advertisement

Hyderabad Bonalu 2026: హైదరాబాద్ బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాతబస్తీలో పర్యటించారు. ముందుగా చారిత్రక చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు. అనంతరం నాంపల్లిలోని ప్రసిద్ధ ఏడు గుళ్ళ పోచమ్మ ఆలయానికి చేరుకున్న కేటీఆర్, తలసాని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఆలయ అర్చకులు వారికి ఘనంగా స్వాగతం పలికి, తీర్థప్రసాదాలను అందజేశారు. బోనాల పండగ సందర్భంగా వివిధ ఆలయాలను సందర్శించడం, భక్తులతో కలిసి వేడుకల్లో పాలుపంచుకోవడం తనకి ఎంతో ఆనందాన్నిస్తుందని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీలను వారు అభినందించారు. అంతే కాకుండా ఈ పండగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని, ప్రతి ఏటా ఈ వేడుకల్లో పాల్గొనడం సంతోషకరమని తెలిపారు.

Advertisement

అనంతరం లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్న కేటీఆర్, అనంతరం ముక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు

Related News

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

Big Stories

Advertisement
×