Abhishek- Aishwarya: బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ బచ్చన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక గత కొన్ని నెలలుగా ఈ జంట విడిపోయారని వార్తలు గుప్పుమంటున్న విషయం కూడా విదితమే. 2007 లో ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే కూతురు కూడా ఉంది. మొదటి నుంచి ఐశ్వర్యకు, ఆమె అత్త జయ బచ్చన్ కు పడదని టాక్ నడిచింది.
ఆరాధ్య పుట్టాకా కొన్నేళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఐష్.. ఆ తరువాత సినిమాలు చేయడం మొదలుపెట్టింది. గత రెండేళ్లుగా ఈ జంట మధ్య విభేదాలు మరింత ముదిరి విడాకుల వరకు వెళ్లిందని తెలుస్తోంది. అనంత్ అంబానీ పెళ్ళిలో కూడా బచ్చన్ ఫ్యామిలీ అంతా కలిసి వస్తే.. ఐష్ తన కూతురుతో కలిసి వెళ్ళింది. ఇక అభిషేక్ కు మరో హీరోయిన్ తో ఎఫైర్ ఉందని, అది బయటపడడంతో ఐష్.. విడాకులు కోరుతుందని పుకార్లు షికార్లు చేశాయి.
Ghaati Glimpse : ‘ఘాటి’ లో అనుష్క లుక్ వచ్చేసింది.. ఇది కదా ఫ్యాన్స్ కోరుకొనేది..
అయితే ఈ విడాకుల రూమర్స్ గురించి అభిషేక్ కానీ, ఐశ్వర్య కానీ క్లారిటీ ఇచ్చింది లేదు. అసలు వీరు కలిసి ఉంటున్నారో.. విడిపోయారో కూడా తెలియకుండా ఫ్యాన్స్ అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ జంట గురించిన ఒక ఆసక్తికరమైన వార్త బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. అదేంటంటే.. ఈ జంట ఒక సినిమా కోసం మళ్లీ కలవనున్నారట.
ఐష్ కి అయినా, అభిషేక్ కి అయినా ఇండస్ట్రీలో గురువు ఎవరైనా ఉన్నారంటే.. అది మణిరత్నం అనే చెప్పాలి. ఆయన దర్శకత్వంలో అభిషేక్ యువ, రావణ్ సినిమాలు చేశాడు. ఇక ఐష్ ను పరిచయం చేసిందే మణిరత్నం. అందుకే ఐష్ కు మణిరత్నం అంటే చాలా గౌరవం.
Prabhas- Anushka: రాజావారు- రాణిగారు.. సిగార్ తో ఇలా కనిపించారు
తాజాగా మణిరత్నం ఒక కొత్త సినిమా కోసం ఈ జంటను సంప్రదించారట. మణిరత్నం మాటను కాదనలేక ఈ జంట కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ వార్త తెలియడంతో.. విడాకులు ఫిక్స్ అన్నారు.. ఇప్పుడేంటి ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.. అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.