KTR VS Bandi Sanjay: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హైడ్రామా నడుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కుమార్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. కేటీఆర్ సిటీ సివిల్ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయగా.. డిసెంబర్ 15న విచారించనున్నట్టు సివిల్ కోర్టు తెలిపింది.
బీఆర్ఎస్ హయంలో మాజీ మంత్రి కేటీఆర్ డ్రగ్స్ తీసుకున్నారని.. రాష్ట్రంలో చాలా మంది ఫోన్లను ట్యాప్ చేశారని.. గతేడాది అక్టోబర్ నెలలో కేంద్ర మంత్రి బండి సజయ్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ పరువు నష్టం నోటీసులు పంపారు. గడిచిన నెలలో బండి సంజయ్ మరోసారి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ -1 పేపర్ లీకేజీ ఆందోళన సమయంలో తన ఫోన్ ను ట్యాప్ చేసి.. పోలీసులు ముందుస్తుగానే ఇంటికి వచ్చారని బండి సంజయ్ విలేకరుల సమావేశంలో అన్నారు. పేపర్ లీకేజీకి సంబంధించిన కేసులో చివరికు జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టు సంచలన ఆరోపణలు కూడా చేశారు.
బండి సంజయ్ ఆరోపణలపై ఆగస్ట్ 12న మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తన పై చేసిన సంచలన ఆరోపణలపై బండి సంజయ్ 48 గంటల్లోనే క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే కోర్టుకు లాగుతా అని కేటీఆర్ అన్నారు. అయితే నోటిసులపై బండి సంజయ్ ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. దీంతో కేటీఆర్ న్యాయపోరాటానికి దిగారు. ఈ క్రమంలోనే బండి సంజయ్ పై పరువు నష్టం దావా వేశారు. తన పరువు ప్రతిష్టను దిగజార్చాలనే ఉద్దేశంతోనే బండి సంజయ్ ఈ సంచలన ఆరోపణలు చేసినట్టు కేటీఆర్ ఆరోపించారు.
కేటీఆర్ ఇప్పటివరకు వేసిన రెండో పరువు నష్టం దావా కేసు ఇది. ఇంతకు ముందు నటి సమంత రూత్ ప్రభు, నటుడు నాగ చైతన్య విడాకులకు సంబంధించిన విషయంపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో మంత్రి సురేఖపై కూడా కేటీఆర్ రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు.
ALSO READ: Vijayawada News: ఫుడ్ ఆర్డర్ మారింది.. ఇలా ఏంటని ప్రశ్నిస్తే.. పీక కోసేస్తారా భయ్యా..?
కేటీఆర్ ఫిర్యాదులో ఏమున్నాయ్..?
గత నెలలో బండి సంజయ్ నాపై తప్పుడు, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్, తెలంగాణ ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) దుర్వినియోగం, గ్రూప్-1 పేపర్ లీకేజీ లాటి పలు విషయాల్లో నాకు సంబంధం లేకున్నా ఆరోపణలు చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలు పలు మీడియా ఛానెళ్లు, సోషల్ మీడియా వేదికల్లో హైలెట్ అయ్యాయి. ఆయన వ్యాఖ్యలు కేవలం పరువు, ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా.. నా క్యారెక్టర్ ను దెబ్బతీసేలా ఉన్నాయి’ అని కేటీఆర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ALSO READ: Jubilee Hills Bypoll: బీఆర్ఎస్ ఎండ్ గేమ్ – జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కేటీఆర్ అనుమానం అదేనా?