E-Paper
Advertisement

తెలంగాణలో సన్నరకం బియ్యానికి ధర ఫిక్స్ చేసిన ప్రభుత్వం.. కొత్త రేట్లు ఇవే?

తెలంగాణలో సన్నరకం బియ్యానికి ధర ఫిక్స్ చేసిన ప్రభుత్వం.. కొత్త రేట్లు ఇవే?
Advertisement

Rice Prices: సన్నబియ్యం ధరల పేరుతో వినియోగదారులపై పడుతున్న అదనపు భారానికి చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సన్నబియ్యం విక్రయాలకు గరిష్ట ధరలను నిర్దేశిస్తూ పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. నిర్ణయించిన ధరలకు మించి బియ్యం విక్రయిస్తే మిల్లర్లు, ట్రేడర్లు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం బీపీటీ , కేఎన్ ఎం రకం సన్నబియ్యం కిలో గరిష్టంగా రూ.66, తెలంగాణ సోనా, ఆర్ ఎన్ ఆర్ రకం కిలో రూ.74, హెచ్ ఎంటీ, జేఎస్ ఆర్ రకం సన్నబియ్యం కిలో రూ.79కు మించి విక్రయించకూడదు. ఈ ధరలు వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా ప్రతి దుకాణంలో ధరల పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు.

మిల్లింగ్‌కు కేరాఫ్‌.. మార్కెట్‌కు కీలక కేంద్రం

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ, హాలియా తదితర ప్రాంతాలు రైస్‌మిల్లింగ్‌కు ప్రధాన కేంద్రాలుగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతాల్లోని పెద్ద సంఖ్యలో రైస్‌మిల్లుల నుంచి భారీగా బియ్యం ఉత్పత్తి అవుతుండగా, హైదరాబాద్ మార్కెట్‌కు పెద్ద మొత్తంలో బియ్యం తరలిపోతోంది. అదే సమయంలో నల్గొండ ప్రాంతం నుంచి కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా బియ్యం రవాణా అవుతోంది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లా బియ్యం ఉత్పత్తి, మిల్లింగ్, రవాణా, విక్రయాల పరంగా రాష్ట్రంలోనే కీలక స్థానాన్ని కలిగి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బియ్యం ధరలపై ప్రభుత్వం గరిష్ట పరిమితులు విధించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉత్పత్తి ప్రాంతాల నుంచి పెద్ద మార్కెట్లకు బియ్యం తరలుతున్న నేపథ్యంలో మధ్యవర్తులు, ట్రేడర్లు, రిటైల్ వ్యాపారుల స్థాయిలో ధరలు పెంచే అవకాశాలను నియంత్రించడమే ప్రభుత్వ నిర్ణయం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.

సన్నబియ్యం పేరుతో దోపిడీకి చెక్..

Advertisement

సన్నబియ్యం పేరుతో రకాన్ని బట్టి భారీ ధరలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ధరలను స్పష్టంగా నిర్దేశించింది. ఒకే రకమైన బియ్యానికి ప్రాంతాన్నిబట్టి, బ్రాండ్‌ను బట్టి, ప్యాకింగ్‌ను బట్టి అధిక ధరలు వసూలు చేసే పరిస్థితికి అడ్డుకట్ట వేయాలని అధికారులు భావిస్తున్నారు. నిర్ణయించిన గరిష్ట ధరల కంటే ఎక్కువకు విక్రయాలు జరుగుతున్నాయా? దుకాణాల్లో ధరల పట్టిక ప్రదర్శిస్తున్నారా? బియ్యం రకం, ప్యాకెట్‌పై ఉన్న వివరాలకు అనుగుణంగానే ధర వసూలు చేస్తున్నారా? అనే అంశాలపై అధికారులు తనిఖీలు చేపట్టే అవకాశం ఉంది.

Also Read: హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర.. రేపు ఈ రూట్లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు!

ధరల పట్టిక లేకుంటే చర్యలు

Advertisement

ప్రతి బియ్యం విక్రయ కేంద్రంలో ప్రభుత్వం నిర్దేశించిన గరిష్ట ధరలను వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాల్సి ఉంటుంది. ధరల పట్టికను ఏర్పాటు చేయకుండా విక్రయాలు నిర్వహించడం, నిర్ణయించిన ధరల కంటే అధికంగా వసూలు చేయడం వంటి అంశాలను అధికారులు సీరియస్‌గా పరిగణించనున్నారు. వ్యాపారులు ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా అధిక ధరలకు బియ్యం విక్రయిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని పౌరసరఫరాల శాఖ హెచ్చరిస్తోంది.

ప్రజలకు ఉపశమనం లభించేనా?

బియ్యం ధరలు పెరిగినప్పుడల్లా దాని ప్రభావం నేరుగా సామాన్య కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై పడుతుంది. ముఖ్యంగా సన్నబియ్యం వినియోగించే మధ్యతరగతి, పేద కుటుంబాలకు ధరల పెరుగుదల అదనపు భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం ధరలకు గరిష్ట పరిమితులు విధించడం ద్వారా మార్కెట్‌పై నియంత్రణ పెంచే ప్రయత్నం చేస్తోంది. ఆదేశాలు క్షేత్రస్థాయిలో పక్కాగా అమలై, అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై చర్యలు తీసుకుంటే వినియోగదారులకు గణనీయమైన ఉపశమనం లభించే అవకాశం ఉంది.

మిల్లింగ్ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా అవసరం

మిర్యాలగూడ, హాలియా వంటి ప్రధాన మిల్లింగ్ కేంద్రాల నుంచి హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు భారీగా బియ్యం తరలుతున్న నేపథ్యంలో సరఫరా గొలుసులోని ప్రతి దశపై నిఘా అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మిల్లింగ్ నుంచి హోల్‌సేల్ మార్కెట్, అక్కడి నుంచి రిటైల్ దుకాణం వరకు ధరల్లో అనవసరమైన పెరుగుదల చోటుచేసుకోకుండా అధికారులు పర్యవేక్షణ పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ప్రకటించిన ధరల వల్ల బియ్యం మార్కెట్‌లో పారదర్శకత పెరగడంతో పాటు వినియోగదారులకు తమ హక్కులపై అవగాహన పెరిగే అవకాశం ఉంది. ధరల నియంత్రణ కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలైతేనే సన్నబియ్యం ధరల భారానికి నిజమైన అడ్డుకట్ట పడనుంది.

Also Read: ఎల్లంపేట మున్సిపాలిటీలో విచిత్రం.. తాను గెలిచిన వార్డు నంబర్‌‌నే మరిచిపోయిన కౌన్సిలర్?

Tags

Related News

గచ్చిబౌలి మారథాన్‌లో తీవ్ర విషాదం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి!

ఎల్లంపేట మున్సిపాలిటీలో విచిత్రం.. తాను గెలిచిన వార్డు నంబర్‌‌నే మరిచిపోయిన కౌన్సిలర్?

అంతర్జాతీయ మార్కెట్లలో.. తెలంగాణ ఉత్పత్తుల హవా..?

సీఎం రేవంత్ రెడ్డికి.. సంచలన లేఖ రాసిన కల్వకుంట్ల కవిత!

పాలమూరులో ప్రైవేట్ ఆసుపత్రుల దందా.. పట్టించుకోని అధికారులు!

భూముల రీ-సర్వేలో అలసత్వం.. సర్వేయర్‌ను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్!

ఉస్మాన్‌నగర్ కేజీబీవీలో దారుణం.. వంట మనుషులు లేరని చదువుకు తాళం!

Big Stories

Advertisement
×