Aghori on Betting App: అసలే టెక్ యుగం.. ఆపై రకరకాల యాప్స్.. అరచేతిలో సెల్‌ఫోన్. యువత టెంప్ట్ అయిన సందర్భాలు కోకొల్లలు. దీనికితోడు బెట్టింగు యాప్స్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఇవన్నీ కలిసి సామాన్యుడు, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపాయి. కుటుంబాలను చిదిమేస్తున్నాయి. బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో చాలామంది పడ్డారు. దీన్ని నుంచి బయటకు రాలేక ఈ లోకాన్ని విడిచి పెట్టిన సందర్భాలు లేకపోలేదు.
మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీమ్‌లకు భిన్నంగా యువతని టార్గెట్ చేసింది బెట్టింగ్ యాప్స్. పరిస్థితి గమనించిన సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్, ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. ఇది తెలుగు రాష్ట్రాలను కదిలించింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది సెర్చ్ చేశారు కూడా. క్యాంపెయిన్‌ను కోట్లాది మంది వీక్షించారు.
దీనిపై తెలంగాణ సర్కారు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, బుల్లి తెర, వెండితెర నటీనటులు నోటీసులు ఇచ్చారు. కొంతమంది సమయం కోరారు. మరి కొందరు విచారణకు హాజరయ్యారు. తాము ఎప్పుడో చేసి మానేసినవి చెప్పారు. వాటిని మరో కంపెనీలు టేకోవర్ చేసుకుని పాత వీడియోలతో ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
ఈ వ్యవహారంపై వేగంగా దర్యాప్తు జరుగుతోంది. ప్రమోట్ చేసినవాళ్లు ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.ఇలాంటి ప్రోత్సహించడం సైబర్ టెర్రరిజం కిందకు వస్తుందన్నది పోలీసుల మాట. ఇక అసలు విషయానికొద్దాం. తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ ఈ మధ్యకాలంలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. హిందూ ధర్మాన్ని రక్షిస్తానంటూ ఎక్కడ పడితే అక్కడ ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చేసింది.
ALSO READ: ఇది రేవంత్ బ్రాండ్.. ఎట్టా ఉంటాదో తెలుసా?
వేములవాడ రాజన్న సన్నిధిలో ఉన్న దర్గాను తొలగిస్తానని ప్రకటన చేసి నానా హంగామా చేసింది. తాజాగా అఘోరీ మరో వివాదంలో చిక్కుకుంది. ఓ యూట్యూబ్ ఛానల్‌లో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్టు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించి వీడియో సైతం బయటకు వచ్చింది. కావాలనే కొందరు ఏఐ ద్వారా క్రియేట్ చేశారా? లేదా అనేదానిపై పోలీసులు ఓ కన్నేసినట్టు తెలుస్తోంది.
అదే నిజమని తేలితే అఘోరీని ఎప్పుడైనా పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అఘోరీకి వాహనం ఇచ్చినవారు ఆ విధంగా ప్రమోట్ చేయించారా? అనే కోణంలో పరిశీలన చేస్తున్నారు. అఘోరీ వ్యవహారం సజ్జనార్ దృష్టికి వస్తే ఎలా రియాక్ట్ అవుతారో అన్నది ఆసక్తికరంగా మారింది. నిజంగా అఘోరీ ప్రమోట్ చేసినట్టు తేలితే అరెస్ట్ కావడం ఖాయమని అంటున్నారు.అదేజరిగితే యాప్ ప్రమోట్ ఇంకెంత మంది పేర్లు వెలుగులోకి వస్తాయో చూడాలి.