BRS : హాస్పిటల్‌కి గులాబీ బాస్ కేసీఆర్. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుప్రతికి ఆయన్ను తీసుకెళ్లారు. పలు హెల్త్ టెస్టులు చేశారు. రిపోర్టులు వచ్చాక కేసీఆర్ కండీషన్‌పై వైద్యులు క్లారిటీ ఇవ్వనున్నారు.
హాస్పిటల్ మార్చిన కేసీఆర్.. ఎందుకేంటి?
మామూలుగా అయితే కేసీఆర్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా.. యశోదా హాస్పిటల్‌కు మాత్రమే వెళ్తుంటారు. కల్వకుంట్ల బంధువులదే ఆ హాస్పిటల్. ఆ ఓనర్ ఆయన ఫ్యామిలీ డాక్టర్. ఏడాది క్రితం కాలు జారి పడినప్పుడు కూడా.. సోమాజిగూడ యశోదలోనే ఆయన తుంటికి ఆపరేషన్ చేశారు. రెగ్యులర్ చెకప్ కూడా అక్కడే చేస్తుంటారు. కానీ, ఇటీవల కేసీఆర్ రూటు మార్చేసినట్టున్నారు. హాస్పిటల్ ఛేంజ్ చేశారు. గచ్చిబౌలిలోని ఏఐజీ లో చూపించుకుంటున్నారు. ఎందుకో మరి?
బిజీబిజీగా గులాబీ బాస్
ఏప్రిల్ 27న వరంగల్‌లో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ అట్టహాసంగా నిర్వహించే పనిలో కేసీఆర్ బిజీగా ఉన్నారు. కొన్ని రోజులుగా వరుసగా జిల్లా నేతలను ఫాంహౌజ్‌కు పిలిపించుకుని వారితో మంతనాలు జరుపుతున్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలను వరంగల్ సభకు తరలించాలని.. అందుకు తగ్గట్టు వాహనాలు సమకూర్చుకోవాలని సూచనలు ఇస్తున్నారు. ఏయే జిల్లాల నుంచి ఎంత మందిని తీసుకురావాలనే లెక్క కూడా గులాబీ బాసే చెబుతున్నారట. జిల్లా, నియోజక వర్గ లీడర్లకు వారి స్థాయిని బట్టి టార్గెట్‌లు కూడా పెడుతున్నారట.
వరంగల్ టెన్షన్ వేధిస్తోందా?
మరో 2 వారాల్లో వరంగల్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ. అది సక్సెస్ అయితేనే పార్టీకి ఉనికి. అదిగానీ సో సో గా జరిగిందా? ఇక అంతే సంగతి. తెలంగాణలో గులాబీ పార్టీకి స్థానం లేదని.. ప్రజాదరణ పోయిందనే.. మెసేజ్ వెళ్లిపోతుంది. ఓవైపు రేవంత్ సర్కార్ దూకుడుతో.. హామీల అమలుతో.. అన్ని వర్గాలు కాంగ్రెస్‌కు జై కొడుతున్నాయి. కేసీఆర్ ఫాంహౌజ్ నుంచి బయటకు రావడమే మానేయడంతో ఆయన్ను క్రమక్రమంగా మర్చిపోతున్నారు జనాలు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని డొల్లతనాన్ని తెలుసుకుంటున్నారు. ఇలాంటి క్లిష్టసమయంలో పార్టీ బహిరంగ సభకు జనం రాకపోతే? వచ్చినా ఆశించినంత ఉత్సాహం కనిపించకపోతే..? ఇదే టెన్షన్‌లో ఉన్నారట కేసీఆర్.
Also Read : కవితా ఏ తోడు లేక.. ఎటేపమ్మ ఒంటరి నడకా?
మీటింగ్‌కు సెట్ రైట్
అసలే ఎండాకాలం. కేసీఆర్‌ది అసలే బక్క పాణం. ఇటు నిత్యం సమీక్షలు.. అటు రాజకీయ ఒత్తిడిలు. రేవంత్‌ను ఎలా ఎదుర్కోవాలా అనే మథనం. వరంగల్ సభకు సమయం దగ్గర పడుతోంది. మీటింగ్ కోసం రెట్టించిన ఉత్సాహంతో సిద్ధం కావాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకోసం ఆరోగ్యం ఎలా ఉందో సరి చూసుకుంటున్నారు. రెగ్యులర్ హెల్త్ చెకప్‌ల కోసమే కేసీఆర్.. గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌కు వచ్చారని చెబుతున్నారు.