BigTV English

Cantonment By poll: కంటోన్మెంట్ బరిలో లాస్య నందిత సోదరి.. ఖరారు చేసిన కేసీఆర్..

Cantonment By poll: కంటోన్మెంట్ బరిలో లాస్య నందిత సోదరి.. ఖరారు చేసిన కేసీఆర్..

BRS Candidate For Cantonment By poll


BRS Candidate For Cantonment By poll: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరును ఖరారు చేశారు ఆ పార్టీ సుప్రీం కేసీఆర్. దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురే నివేదిత. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాయన్న పెద్ద కుమార్తె లాస్య నందిత ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆమె యాక్సిడెంట్ లో చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో కేసీఆర్.. లాస్యనందిత చెల్లి నివేదితకే టికెట్ అనౌన్స్ చేశారు.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. ఇటీవలే బీజేపీని వీడి హస్తం గూటికి చేరిన శ్రీ గణేశ్‌కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఇంకా బీజేపీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.


Also Read: Secunderabad Cantonment By Election : కంటోన్మెంట్ ఉపఎన్నిక.. కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీగణేష్

గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి దివంగత నేత సాయన్న కూతురు లాస్య నందిత.. బీజేపీ అభ్యర్ధి శ్రీ గణేశ్‌పై 17 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన గద్దర్ కూతురు వెన్నెల మూడో స్థానానికే పరిమితమయ్యారు. కాగా ఉపఎన్నికల్లో గెలిచి పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. అటు బీఆర్ఎస్ తమ అస్థిత్వాన్ని కాపాడుకోడానికి ప్రయత్నిస్తుందని చెప్పవచ్చు.

కాగా మే 13న లోక్ సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై పోల్ కూడా జరగనుంది.

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×