E-Paper
Advertisement

కౌశిక్ రెడ్డివి దొంగ దీక్షలు.. డంపింగ్ యార్డ్ వెనుక ఉన్న అసలు కథ ఇదే..?

కౌశిక్ రెడ్డివి దొంగ దీక్షలు.. డంపింగ్ యార్డ్ వెనుక ఉన్న అసలు కథ ఇదే..?
Advertisement

Voter Deletion: స్వేచ్చ బ్యూరో: దేశంలో భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతామని, ఎస్ఐఆర్ (SIR) పేరుతో ఓట్లను తొలగిస్తే చూస్తూ ఊరుకోబోమని హుజూరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ హెచ్చరించారు. శనివారం హుజూరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ పరిశీలకులు, పీసీసీ ప్రధాన కార్యదర్శులు ఆడమ్ రాజ్ డెక్కపాటి, కాశపాక రాజేష్‌లతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. .

ఓట్ల పరిరక్షణే లక్ష్యం..

ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ.. దేశంలో ఎస్ఐఆర్ విధానం వల్ల ఇప్పటికే 12 రాష్ట్రాల్లో పేద, మధ్యతరగతి వర్గాల ఓట్లను అక్రమంగా తొలగించారని ఆరోపించారు. చొరబాటుదారుల సాకుతో మైనారిటీ, బీసీ, ఎస్సీ ఓటర్లను ఓటు హక్కుకు దూరం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఇలాంటి పొరపాట్లు జరగకుండా నియోజకవర్గంలోని ప్రతి బూత్‌కు ‘బూత్ లెవల్ కమిటీ’లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కమిటీల వివరాలను పీసీసీ, డీసీసీలకు అందజేస్తామని, ఓటు హక్కు విషయంలో ఏ సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Also Read: మేడ్చల్ పెద్ద చెరువుకి కన్నం.. తూములు తెరిచి నీరు వృథా ..!

కౌశిక్ రెడ్డివి సినిమా షూటింగ్‌లు..

మరోవైపు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై ప్రణవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సిర్స పల్లి డంపింగ్ యార్డ్ పై ఎమ్మెల్యే చేస్తున్నవి కేవలం రాజకీయ ఉనికి కోసమే తప్ప, ప్రజల కోసం కాదని విమర్శించారు. “సోషల్ మీడియా రీల్స్ కోసం కౌశిక్ రెడ్డి పాకులాడుతున్నారు. బంద్ పేరుతో సామాన్య ప్రజలను, చిరు వ్యాపారులను ఇబ్బంది పెడుతున్నారు. దీక్షా స్థలి వెనుక క్యారవాన్ పెట్టుకుని సినిమా షూటింగ్ తరహాలో ఆయన చేస్తున్నవి దొంగ దీక్షలు” అని ఎద్దేవా చేశారు.

డంపింగ్ యార్డ్ పాపం గత ప్రభుత్వానిదే..

Advertisement

పట్టణంలోని డంపింగ్ యార్డ్ సమస్యపై మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు గత ప్రభుత్వ హయాంలోనే రూపుదిద్దుకుందని గుర్తు చేశారు. అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న కౌశిక్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలకవర్గం బాధ్యతలు చేపట్టగానే డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా తొలి తీర్మానం చేసిందని చెప్పారు. డంపింగ్ యార్డ్‌ను ప్రస్తుత స్థలం నుంచి మార్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబుతో చర్చించామని తెలిపారు. రెండు రోజుల్లో అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రజల ఆరోగ్యానికి భంగం కలగకుండా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రోంటాల సుహాసిని, కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్, మైనారిటీ విభాగాల నాయకులు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Also read: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఒక వసూల్ రాజా : కేటీఆర్

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×