E-Paper
Advertisement

CPI And CPM: కామ్రేడ్ లను కలుపుకోవట్లే.. ప్రధాన పార్టీలన్నీ పొత్తులకు ససేమిరా!

CPI And CPM: కామ్రేడ్ లను కలుపుకోవట్లే.. ప్రధాన పార్టీలన్నీ పొత్తులకు ససేమిరా!
Advertisement

CPI And CPM: ఒకప్పుడు ఎన్నికలు వచ్చాయంటే వామపక్ష పార్టీ నేతలతో ప్రధాన పార్టీ నేతలు భేటీ అయ్యేవారు. సీట్ల సర్దుబాటు చేసుకునేవారు. వామపక్షాల మద్దతు ఉంటే తాము విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేసేవారు. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు రివర్స్ అయింది. పొత్తు కోసం కమ్యూనిస్టులు ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రధాన పార్టీలు మాత్రం విముఖత చూపుతున్నాయి. దానికి కారణం ఆ పార్టీల ప్రభావం లేకపోవడమేనని స్పష్టమవుతుంది. రాష్ట్రంలో కమ్యూనిస్టుల ప్రభావం ఉండేది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ , రంగారెడ్డి జిల్లాలో కీలక భూమిక పోషించేవారు.

ప్పుడు ఆ పరిస్థితి రివర్స్

ఆ పార్టీలో పొత్తుకు కాంగ్రెస్, టిఆర్ఎస్, టిడిపిలో సైతం గతంలో ముమ్మర ప్రయత్నాలు చేసేవారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా, ఉప ఎన్నికల వచ్చిన పొత్తు పెట్టుకునేవారు. ఆ పార్టీ కార్యాలయానికి వెళ్లి మరీ సీట్ల సర్దుబాటు చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి రివర్స్ అయ్యింది అనేది స్పష్టం అవుతుంది. ఆ పార్టీల ప్రాబల్యం తగ్గడంతోనే పొత్తులకు ముందుకు రావడం లేదా అనేది చర్చ జరుగుతుంది. వామపక్ష పార్టీలు పొత్తుల కోసం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదని విశ్వాసనీయా సమాచారం.

Advertisement

Also ReadGadwal Municipal Elections: మున్సిపాలిటీలో గెలుపే లక్ష్యంగా పార్టీల వ్యూహాలు.. జోరందుకున్న ఇంటింటా ప్రచారాలు!

 ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ

సిపిఐ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తుకు వెళ్లినప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేశాయి. మున్సిపల్ ఎన్నికల్లోనూ పొత్తు కోసం ప్రయత్నం చేసిన సీట్ల సర్దుబాటు కాకపోవడంతోనే ఇరు పార్టీలు వేరువేరుగా పోటీ చేస్తున్నాయని సమాచారం. సిపిఎం సైతం పొత్తుల కోసం ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదని సమాచారం. దీంతో ఒంటరిగానే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. టిఆర్ఎస్ పార్టీతో పొత్తు కోసం ఆయా మున్సిపాలిటీలో కమ్యూనిస్టు నేతలు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. అయితే అందుకు గులాబి నేతలు సైతం ససేమిరా అన్నట్లు తెలిసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కమ్యూనిస్టుల ప్రభావం తగ్గింది.

ప్రజా సమస్యలపై నిరసన కార్యక్రమాలకే పరిమితం

Advertisement

ఆ పార్టీలు క్షేత్రస్థాయిలో బలోపేతంపై దృష్టి సారించకపోవడం, కేవలం ప్రజా సమస్యలపై నిరసన కార్యక్రమాలకే పరిమితం అయ్యాయి. అనుబంధ సంఘాలు బలంగా ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోటీ చేస్తే మాత్రం ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో ఓటింగ్ రావడం లేదు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేపడుతున్నప్పటికీ ఎన్నికలకు వచ్చేసరికి ప్రజలు బాసటగా నిలవడం లేదు. ఈ ఫలితాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు కమ్యూనిస్టు పార్టీలతో కలిసి నడిచేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నాయని ప్రచారం జరుగుతుంది. సిపిఎం,సిపిఐ పార్టీల అధిష్టానాలు గ్రామస్థాయిలో బలోపేతం కావడానికి దృష్టి సారించడం లేదని ఆ పార్టీ నేతలే బహిరంగంగా అభిప్రాయపడుతున్నారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పార్టీల మనుగడ కష్టమేనని ప్రచారం జరుగుతుంది.

ఇతర పార్టీల పొత్తుల కోసం ప్రయత్నాలు

కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర నాయకత్వాలు కేవలం పదవుల కోసమే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప పార్టీ బలోపేతం, ఏళ్లుగా పనిచేస్తున్న కార్యకర్తలను విస్మరిస్తున్నారని పలువురు గుస్సా అవుతున్నారు. పార్టీ ఇంటర్నల్ మీటింగ్ లోను ఇదే విషయాన్ని పలువురు ప్రశ్నించినట్లు సమాచారం. నాయకులే పదవుల కోసం ఇతర పార్టీల పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీ బలోపేతంపై దృష్టి సారించడం లేదని.. మీరు బాగుంటే.. మీకు పదవులు వస్తే సరిపోతుందా? క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై ఎందుకు దృష్టి సారించడం లేదని నిలదీస్తున్నట్లు సమాచారం.

పార్టీ అధిష్టానాలు దృష్టి

బలంగా ఉన్న జిల్లాలో సైతం పార్టీ అధిష్టానాలు దృష్టి సారించకపోవడం.. నామ్ కే వాస్తేగా కార్యక్రమాలు చేపడుతూ ముగిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో బలమైన ఉద్యమాలు చేపట్టకపోవడంతోనే వామపక్ష పార్టీల ప్రాబల్యం తగ్గుతుందని.. మరోవైపు రెండు పార్టీలు కలిసి ఎన్నికల పోకపోవడం.. ఎవరికివారుగా పోటీ చేయడం.. ప్రభావం చూపలేకపోతున్నారని సమాచారం. ఇప్పటికైనా వామపక్ష పార్టీలు ఎన్నికల సమయంలో పొత్తుల కోసం కాకుండా పార్టీ బలోపేతంపై.. వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేసేలా ప్రత్యేక కార్యాచరణలతో ముందుకు పోతే నే భవిష్యత్తులో మనుగడ సాధ్యమవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ రెండు పార్టీలు ఎలాంటి కార్యాచరణతో పోతాయనేది వేచి చూడాలి.

Also Read: Union Budget 2026: బడ్జెట్ 2026… ఆటో ఇండస్ట్రీపై ప్రభావం ఎంత? నిపుణులు ఏం చెప్తున్నారు?

Related News

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Hyderabad: పైరవీలకు చెక్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ముఖ్యనేతలకు కీలక సూచనలు

వారెవ్వా గోల్కొండ! భక్తులతో కిక్కిరిసిన కోట.. అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

Big Stories

Advertisement
×