E-Paper
Advertisement

Messi Hyderabad Visit: ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మెస్సీ బస.. ఈ హోటల్‌లో విలాసవంతమైన గదులు, ఇంకా ఏమున్నాయంటే..?

Messi Hyderabad Visit: ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మెస్సీ బస.. ఈ హోటల్‌లో విలాసవంతమైన గదులు, ఇంకా ఏమున్నాయంటే..?
Advertisement

హైదరాబాద్‌లోని ప్రముఖ చారిత్రాత్మక హోటల్‌ ఫలక్‌నుమా ప్యాలెస్ కు ఓ ప్రత్యేకత ఉంది. సాకర్‌ దిగ్గజం, అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనల్మెస్సీ ఈ హోటల్‌లోనే బస చేయనున్నారు. దీంతో ఫలక్‌నుమా ప్యాలెస్‌ ప్రాముఖ్యత ఏంటనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Advertisement

ఫలక్‌నుమా అంటే ‘ఆకాశ దర్పణం’ అని అర్థం. దీన్ని ‘పైగా’ వంశానికి చెందిన హైదరాబాద్‌ ప్రధాని సర్‌ వికారుల్ఉమ్రా ఇక్బాల్‌ దౌలా బహదూర్‌ ఒక ఎత్తైన గుట్టపై నిర్మించారు. 300 ఎకరాల్లో ఉన్న ఫలక్‌నుమా ప్యాలెస్‌లో 60 విలాసవంతమైన గదులు, 22 విశాలమైన హాళ్లు ఉన్నాయి. ఇందులో మూడు రాజ దర్భార్లతో సమానమైన గదులు ఉన్నాయి. ఇందులోనే మెస్సీకి విడిది ఏర్పాటు చేశారు. ప్రధాన రిసెప్షన్ గది ఒకటి. ఈ గదిలోని సీలింగ్‌కు ఇసుక, సున్నం, నీటితో కలిపిన డెకరేషన్.. అచ్చం బంగారు తాపడం చేసిన అనుభూతిని కలిగిస్తుంది. రిసెప్షన్‌లో మెస్సీ సైన్ చేయడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ప్యాలెస్‌లో డైనింగ్‌కు ఒక ప్రత్యేకత ఉంది. 108 అడుగుల పొడవు, 5.7 అడుగుల వెడల్పు, 2.7 అడుగుల ఎత్తున్న డైనింగ్ టేబుల్‌ను బంగారం, క్రిస్టల్‌తో తయారు చేశారు. డైనింగ్ టేబుల్‌పై ఒకేసారి 100 మంది అతిథులు కూర్చుని భోజనం చేసే అవకాశం ఉంది. ఇక్కడే మెస్సీకి స్నాక్స్ సర్వ్ చేయనున్నారు.

Advertisement

ప్యాలెస్‌లో ఒక అద్దం.. ప్రపంచంలోనే అరుదైనది. దీని ప్రస్తుత మార్కెట్ విలువ 35 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ప్యాలెస్‌లో అరుదైన వస్తువులను మెస్సీకి చూపించే సమయంలో ఈ మిర్రర్‌ను ఖచ్చితంగా చూపించనున్నారు.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×