Liquor Shop Close: అసలే ఎండాకాలం.. రాత్రివేళ కాస్త మందు పుచ్చుకోకుంటే మందుబాబులకు నిద్ర రాదు. అలాంటిది మూడురోజుల పాటు మద్యం దుకాణాలు మూత పడనున్నాయి. ఇంతకీ కారణమేంటో తెలుసా? హైదరాబాద్ సిటీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రూల్స్‌ని అతిక్రమిస్తే చర్చలు తప్పవని హెచ్చరించారు.
హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఏప్రిల్ 21 (సోమవారం) సాయంత్రం 4 గంటల నుండి మొదలు ఏప్రిల్ 23 (బుధవారం) సాయంత్రం 6 గంటల వరకు మద్యం, వైన్ షాపులు మూతపడనున్నాయి. ఆ తర్వాత షాపులు ఓపెన్ కానున్నాయి.
కంటిన్యూ మూడు రోజులు
ఒక విధంగా చెప్పాలంటే మద్యం బాబులకు ఊహించని షాక్. కౌంటింగ్ జరిగే ఈనెల 25న మద్యం దుకాణాలు క్లోజ్ చేయాలని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఎండాకాలంలో పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేయడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. గడిచిన పదేళ్లలో ఈ తరహా ఎన్నికలు లేవని అంటున్నారు.
22 ఏళ్ల తర్వాత ఎన్నిక
దాదాపు 22 ఏళ్ల తర్వాత హైదరాబాద్ సిటీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. దీంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఒకవిధంగా చెప్పాలంటే హైదరాబాద్ సిటీపై రాజకీయ పార్టీలు పట్టు సాధించడమే. బలమైన ఓటు బ్యాంకు ఉన్న ఎంఐఎం విజయంపై ధీమాగా ఉంది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో తమ అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్‌ని గెలిపించుకోవాలని చూస్తోంది. కచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పకనే చెబుతోంది.
ALSO READ: పూర్వ వైభవం కోసం తహతహ.. సహకరించని కొందరు నేతలు?
ఇప్పటివరకు బలంగా ఉన్న విపక్ష బీఆర్ఎస్ ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. బీఆర్ఎస్ నిర్ణయం బీజేపీకి కలిసి వస్తుందని అంటున్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ దూరంగా ఉండడంతో బీజేపీ ఆయా సీట్లను గెలుచుకుందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
బీఆర్ఎస్‌ను నమ్ముకున్న బీజేపీ
బీఆర్ఎస్ డ్రాప్ కావడంతో బీజేపీ తెరపైకి వచ్చింది. ఆ పార్టీ తరపున గౌతమ్ రావును బరిలోకి దింపింది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పోటీ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. మొత్తం 112 మంది ఓటర్లలో 81 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అందులో 31 మంది ఎక్స్-అఫీషియో సభ్యులున్నారు.
ఎక్స్-అఫీషియో సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎంఐఎం, బీఆర్ఎస్- 9 మంది ఎక్స్-అఫీషియో సభ్యుల ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్‌కు-7, బీజేపీ- 6 ఓట్లు ఉన్నాయి. ఈ లెక్కన బీజేపీ కేవలం బీఆర్ఎస్ ను నమ్మకుందని అర్థమవుతుంది. ఈ ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఏప్రిల్ 25న జరగనుంది.