Onion Storage Tips: ప్రతి ఒక్కరి వంటగదిలో ఉల్లిపాయ అత్యంత అవసరమైన పదార్థాల్లో ఒకటి. కూరగాయలు వండడానికి, గ్రేవీ తయారు చేయడానికి లేదా సలాడ్‌ల అలంకరణకు.. ప్రతి రోజూ ఇంట్లో మనం ఉల్లిపాయను ఉపయోగిస్తారు. కానీ ఉల్లిపాయలు కొన్ని రోజుల్లోనే కుళ్ళిపోవడం,లేదా మొలకెత్తడం వంటివి మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా వాతావరణం తేమగా లేదా వేడిగా ఉన్నప్పుడు ఉల్లిపాయలు త్వరగా పాడవుతాయి. ఫలితంగా డబ్బు వృధా అవుతుంది.
ఇలాంటి సమయంలో ఉల్లిపాయను సరిగ్గా నిల్వ చేస్తే.. అవి ఏడాది పొడవునా సురక్షితంగా ఉంటాయి. కొన్ని సాంప్రదాయ, శాస్త్రీయ పద్ధతుల సహాయంతో, మీరు మీ ఇంట్లో ఉల్లిపాయలను చాలా కాలం పాటు తాజాగా ఉంచుకోవచ్చు. ఈ పద్ధతులను అనుసరించడం ద్వారా.. ఉల్లిపాయల నాణ్యతను కాపాడుకోవడమే కాకుండా అవి కుళ్ళిపోకుండా కాపాడుకోవచ్చు.
ఉల్లిపాయలను నిల్వ చేయడానికి 5 మార్గాలు:
మెష్ సంచులలో నిల్వ చేయడం:
ఉల్లిపాయలకు గాలి అందుబాటులో ఉండాలి. లేకుంటే అవి తేమ కారణంగా కుళ్ళిపోవడం ప్రారంభమవుతుంది. అందుకే.. ఉల్లిపాయలను ప్లాస్టిక్ సంచులలో నిల్వ చేయడానికి బదులుగా.. జనపనార లేదా మెష్ సంచులలో నిల్వ చేయండి. ఇటువంటి సంచులు గాలి ప్రసరణకు సహాయపడతాయి. ఇవి ఉల్లిపాయలను పొడిగా, తాజాగా ఉంచుతాయి. ఈ సంచులను నీడ, చల్లని ప్రదేశంలో వేలాడదీయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
నీడ, పొడి ప్రదేశాన్ని ఎంచుకోండి:
ఉల్లిపాయలను ఎండలో ఉంచడం వల్ల అవి మృదువుగా మారి త్వరగా కుళ్ళిపోతాయి. ఇదే సమయంలో, అధిక తేమ ఉన్న ప్రదేశంలో ఉంచడం వల్ల దానిలో ఫంగస్ పెరుగుతుంది.కాబట్టి.. ఉల్లిపాయలను ఎల్లప్పుడూ పొడి, చల్లని , నీడ ఉన్న ప్రదేశంలో నిల్వ చేయండి. NHRDF ప్రకారం.. 25-30 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత , 60-70% తేమ ఉల్లిపాయలకు అనువైనది.
ఉల్లిపాయల గ్రేడింగ్:
అన్ని ఉల్లిపాయలను నిల్వ చేసే ముందు వాటిని వేరు చేయండి. దెబ్బతిన్న, కుళ్ళిన లేదా మొలకెత్తిన ఉల్లిపాయలను మిగిలిన వాటి నుండి వేరుగా ఉంచండి. ఎందుకంటే అవి ఇతర ఉల్లిపాయలను కూడా పాడు చేస్తాయి. పూర్తిగా ఎండిన, లేదా తేమ లేని ఉల్లిపాయలను మాత్రమే నిల్వ చేయండి. ఈ పద్ధతి వాటి నిల్వ జీవితాన్ని పెంచడంలో చాలా సహాయపడుతుంది.
Also Read: కాకరకాయ తింటే.. ఆశ్చర్యపోయే లాభాలు !
వెదురు బుట్టలు లేదా చెక్క పెట్టెలు:
ఉల్లిపాయలను వెదురు బుట్టలు లేదా చెక్క పెట్టెలలో కూడా నిల్వ చేయవచ్చు. వాటిలో నిరంతరం గాలి ప్రవాహం ఉంటుంది. దీని కారణంగా ఉల్లిపాయలు సురక్షితంగా ఉంటాయి. బుట్ట లేదా పెట్టె నేల నుండి కొంచెం ఎత్తులో ఉంచాలని గుర్తుంచుకోండి. తద్వారా వాటి కింద నుండి తేమ రాకుండా ఉంటుంది.
బూడిద లేదా పొడి ఇసుక:
గ్రామీణ ప్రాంతాల్లో ఉల్లిపాయలను ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ఒక సాంప్రదాయ పద్ధతిని పాటిస్తారు. వాటిని బూడిద లేదా పొడి ఇసుక పొరలలో ఉంచడం ద్వారా ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. ఉల్లిపాయ పొరలపై బూడిదను చల్లుకోండి ఈ పద్ధతి తేమను గ్రహించి ఉల్లిపాయలు కుళ్ళిపోకుండా ఉండటానికి సహాయపడుతుంది.