BigTV English

Akhanda 2 : బాలకృష్ణ అఖండ 2 షూటింగ్ అప్డేట్… ఇప్పుడు షూటింగ్ ఎక్కడంటే..?

Akhanda 2 : బాలకృష్ణ అఖండ 2 షూటింగ్ అప్డేట్… ఇప్పుడు షూటింగ్ ఎక్కడంటే..?

Akhanda 2 : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ కాంబినేషన్స్ లో బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ ఒకటి. బోయపాటి శ్రీను ఎంతమందితో సినిమాలు చేసినా కూడా బాలకృష్ణతో సినిమా అంటేనే ఒక హై ఉంటుంది. ఎందుకంటే బాలకృష్ణని ఎలా చూపించాలో ఎలా చూపిస్తే ప్రేక్షకులు ఇష్టపడతారు అనేదాంట్లో పిహెచ్డి చేశాడు అనే విధంగా సినిమాను తెరకెక్కిస్తుంటాడు. భద్ర సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన బోయపాటి శ్రీను తన కెరీర్ లో ఎన్నో హిట్స్ సినిమాలు చేశాడు. అయితే బాలకృష్ణ తో చేసిన సినిమాలు మాత్రం మంచి పేరును తీసుకొచ్చాయి.


సింహా సినిమాతో మొదలైన కాంబినేషన్

ఆల్మోస్ట్ బాలకృష్ణ కెరియర్ ముగిసిపోతుంది అనుకున్న టైంలో శ్రీను దర్శకత్వంలో సింహా అనే సినిమాను చేశాడు బాలయ్య. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత బాలయ్య వరుస సినిమాలకు సైన్ చేసాడు. మరోవైపు బోయపాటి శ్రీను కూడా ఫుల్ బిజీ అయిపోయాడు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి లెజెండ్ అనే మరో సినిమా చేశారు. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. బాలకృష్ణను రెండు పాత్రలలో చూపించి బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకున్నాడు. లాస్ట్ గా వచ్చిన అఖండ సినిమా గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బాలకృష్ణ నట విశ్వరూపాన్ని ఆ సినిమాలో బయటపెట్టాడు బోయపాటి. అలానే థమన్ అందించిన మ్యూజిక్ కూడా సినిమాకి మంచి ప్లస్ అయింది.


Also Read : Megastar Chiranjeevi: ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ కు మెగాస్టార్ చిరంజీవి

అఖండ షూటింగ్ అప్డేట్

ప్రస్తుతం అఖండ 2 సినిమాకి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర పోచంపల్లి గుట్టల దగ్గర లో జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కాగా అప్పట్లో బాలకృష్ణ వరుసగా సినిమాలు చేస్తున్న కూడా అవి బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవుతూ వచ్చాయి. అయితే బాలకృష్ణకి అన్ స్టాపబుల్ అనే షో కూడా చాలా పెద్ద ప్లస్ అయింది. అంతకు ముందు బాలయ్య తీరు చాలామందికి నెగిటివ్ ఇంప్రెషన్ తీసుకొస్తే, ఈ షో మాత్రం బాలయ్య లోని అసలైన వ్యక్తిత్వాన్ని బయటపెట్టింది. వ్యక్తులతో మాట్లాడే విధానం. వాళ్లతో మాట్లాడే తీరు ఇవన్నీ కూడా బాలకృష్ణకి ఒక ప్రత్యేకమైన అభిమానాన్ని తీసుకొచ్చి పెట్టాయి. అదే అఖండ సినిమాకి కూడా ఒక రకంగా ప్లస్ అయిందని చెప్పొచ్చు.

Also Read : Vijay Devarakonda: అవకాశాలు ఉన్నపుడు, పెద్దగా కలలు కనడానికి మీరు భయపడకూడదు!

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×