BRS Sabha: బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందా? గడిచిన పదేళ్లు తిరుగులేదనే విధంగా కనిపించిన నేతలు, కేడర్ ఎందుకు ఒక్కసారిగా డీలా పడ్డారు? పార్టీలో కేవలం కీలక నేతలు గొంతు మాత్రమే వినిపిస్తోందా? రజతోత్సవ సభపై అప్పుడే ఎలాంటి గుసగుసలు వినిపిస్తున్నాయి? అధికార పార్టీని ఎండగట్టగానికి ఎలాంటి ఎత్తులు వేస్తున్నారు గులాబీ బాస్? రజతోత్సవ సభ పార్టీకి ఊపు వస్తుందా? ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
సభ ఏర్పాట్ల వెనుక
ఏప్రిల్ 27 నాటికి బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి రెండున్నర దశాబ్దాలు కాబోతోంది. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది ఆ పార్టీ. కనివిని ఎరుగని రీతిలో సభకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ సభ ద్వారా పార్టీపై ప్రజలకు నమ్మకం కలిగేలా చేయాలన్నది ఆ పార్టీ ఆలోచనగా తెలుస్తోంది. కాకపోతే స్థానిక నేతలు సహకరించడం లేదన్న వార్తలు లేకపోలేదు.
తొలుత సభను హైదరాబాద్ లో పెట్టాలని భావించారట. ఆ తర్వాత నిజామాబాద్, నల్గొండ అనుకుని చివరకు వరంగల్‌ని ఫిక్స్ చేశారట. నార్మల్‌గా హైదరాబాద్ సిటీలో పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉందని, అక్కడ సభ పెడితే ప్రభుత్వం పర్మిషన్ విషయంలో లేనిపోని ఆంక్షలు పెడుతుందని భావించినట్టు మార్చినట్టు తెలుస్తోంది. సభకు ఏమైనా లోటుపాట్లు వస్తే మీడియా ఏకుతుందని భావించి ఈ విధంగా స్కెచ్ వేశారని అంటున్నారు.
దీనికితోడు ఉత్తర తెలంగాణ పార్టీ బలంగా ఉందని భావించారట ముఖ్యనేతలు. వరంగల్‌లో సభ జరిగితే దాని ప్రభావం నల్గొండ, ఖమ్మం జిల్లాలపై ఉంటుందని భావించి ఎంపిక చేసినట్టు ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు చెబుతున్న మాట. సభ ఏర్పాట్ల విషయంలో కొందరు నేతలు ముఖం చాటేస్తున్నారని అంటున్నారు.
ALSO READ: జపాన్‌లో సీఎం రేవంత్ బిజీ, కీలక ఒప్పందాలు?
గుసగుసలు దేనికి?
పదేళ్లు అధికారంలోకి పార్టీ, కనీసం తమ వైపు కన్నెత్తి చూడలేదని అంటున్నారు. సభ విషయంలో తాము గుర్తు వచ్చామా? అంటూ ప్రశ్నిస్తున్నారట. జరుగుతున్న పరిణామాలను గమనించి పార్టీ హైకమాండ్ జోక్యం చేసుకుందని అంటున్నారు. సభ ఏమోగానీ అప్పుడు రకరకాల గుసగుసలు చక్కర్లు కొడుతున్నాయి.
జనాలను కూడదీయడంలో కొందరు దూరంగా అంటీ అంటనట్టుగా వ్యవహరిస్తున్నారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము ఖర్చు చేయలేమని ముఖం చాటేసినట్టు గుసగుసలు లేకపోలేదు. అయితే ఈ సభ ద్వారా నేరుగా అధికార కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాలని భావిస్తున్నారట కారు పెద్దలు. ఇప్పుడున్న సమయంలో బీజేపీకి జోలికి వెళ్లకుండా ఉండడమే బెటరని అంటున్నారు. దీనివల్ల లేనిపోని సమస్యలు వస్తాయనే ప్రచారం నడుస్తోంది.
ఏడాదిగా రేవంత్ పాలన లక్ష్యంగా చేసుకుని అడుగులు వేయాలని, నేతల స్పీచ్ అలాగే ఉండాలని ఇప్పటికే కొందరు నేతలకు పార్టీ నుంచి స్పష్టమైన సంకేతాలు వెళ్లాయట. దీనివల్ల పార్టీకి, రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని అంటున్నారు. బహిరంగ సభకు ఇంకా ఆరు రోజులు మాత్రమే మిగిలివుంది. సభకు హాజరయ్యే నేతలు విషయం ఏమోగానీ, రాబోయే రోజుల్లో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.