Jangaon : జనగామ జిల్లా దేవరుప్పల మండలంలో విద్యార్ధులు తినే భోజనంలో బల్లి పడింది. అప్పటికే ఆ భోజనం తిన్న 14 మంది తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన దేవరుప్పల మండలంలోని కస్తూర్బా విద్యాలయంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. రాత్రి భోజనం తినేసమయంలో విద్యార్ధి శ్రీవాణికి వడ్డించిన ప్లేటులో బల్ల కనిపించింది. దీంతో విద్యార్ధులు భయాందోళనకు గురయ్యారు. అప్పటికే ఆహారం తిన్న 14మందికి కడుపు నొప్పి రావడంతో.. వెంటనే పాఠశాల నిర్వాహకులు విద్యార్థినులను 108 వాహనంలో జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
విద్యార్ధులు అస్వస్థతకు గురికావడంతో.. వారి తల్లిదండ్రులు పాఠశాల నిర్వాహకులపై మండిపడ్డారు. పాఠశాల ఎదుటే బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్ధులను అదనపు కలెక్టర్, డీఈవో పరామర్శించారు. విషయం తెలుసుకున్న మంత్రి ఎల్లబల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. విద్యార్ధులకు మెరుగైన చికిత్సకోసం అవసరమైతే హైదరాబాద్‌కు తరలించారన్నారు. ఈ దుర్గటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
కస్తూర్బా పాఠశాలలో అనేక సమస్యలు ఉన్నాయని చికిత్స పొందుతున్న విద్యార్ధులు పరామర్శించడానికి వచ్చిన విద్యార్ధులకు తెలిపారు. ఆహారం ఉడికీ ఉడకనట్టు వండిపెడతారన్నారు. డార్మిటరీ, మరుగుదొడ్లు అద్వానంగా ఉన్నాయని చెప్పారు. పడుకోవడానికి స్థలం లేనప్పుడు క్లాస్‌రూమ్స్‌లో పడుకుంటున్నమాని చెప్పారు. డోర్లు సరిగా లేకపోవడంతో లోపలికి విషపురుగులు వస్తుంటాయిని.. తీవ్ర ఇబ్బందులను ప్రతీ రోజు ఎదుర్కోవాల్సి వస్తోందని విద్యార్ధినులు వాపోయారు.