E-Paper
Advertisement

బీఆరెస్‌ను తుత్తునియలు చేసే క‌విత ప‌ది అస్త్రాలు..! అవినీతి బండారం, పార్టీ నిజ స్వ‌రూపంపై సంచల‌నం..!

బీఆరెస్‌ను తుత్తునియలు చేసే క‌విత ప‌ది అస్త్రాలు..! అవినీతి బండారం, పార్టీ నిజ స్వ‌రూపంపై సంచల‌నం..!
Advertisement

రామ‌న్న నైజం, హ‌రీశ్‌త‌త్వం.. పార్టీ నిజ స్వ‌రూపం… వీటిపై క‌విత త‌న‌దైన శైలిలో ఆరోప‌ణాల‌స్త్రాలు సంధించారు. ప్ర‌ధానంగా ప‌ది అంశాల‌ను ఆమె లేవనెత్తారు. ఆరోపించారు. వీటిపై స్పందించాల్సిందిగా కూడా స‌వాల్ విసిరారు. అవి ఆషామాషీ ఆరోప‌ణ‌లు కాద‌ని, ద‌మ్ముంటే వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆమె బీఆరెస్ పార్టీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ఖ‌మ్మం జిల్లా కొత్త‌గూడెం బాయిబాట కార్య‌క్ర‌మంలో ఇవాళ పాల్గొన్న ఆమె ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. గ‌తంలో చాలాసార్లు బీఆరెస్ పార్టీపై మాట్లాడినా.. ఆమె ఈసారి మాట్లాడిన‌, ఆరోపించిన అంశాలు సంచ‌ల‌నంగా మారాయి. అవి ఏకంగా ఆ పార్టీ భారీ అవినీతిని బ‌హిర్గ‌తం చేసే విధంగా ఉన్నాయి.

Advertisement

ఇది బీఆరెస్ కూడా ఊహించి ఉండ‌దు. క‌విత రూపంలో ఈ విధంగా రోజుకో దెబ్బ ప‌డుతూనే ఉంది బీఆరెస్‌పై. సంద‌ర్భం లేకుండా ఆమె ఆరోపించ‌డం లేదు. త‌న మానాన త‌ను పార్టీ పెట్టుకుని కార్య‌క్ర‌మాలు చేసుకుంటుంటే.. అడ‌గ‌డుగునా ఆటంకాలు సృష్టించే విధంగా ఉన్న ఆ పార్టీ ముఖ్య‌నేత‌లైన కేటీఆర్‌, హ‌రీశ్ చ‌ర్య‌లపై ఆమె ఆగ్ర‌హంగా ఉన్నారు.

తోక తొక్కిన తాచులా ఆమె కేటీఆర్‌, హ‌రీశ్‌, కేసీఆర్‌పై కూడా ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. ఆ పార్టీకి ఓ విధానం, నీతి, నియ‌మం అంటూ ఏదీ లేద‌ని గంజిలో ఈగ లెక్క తీసిపారేశారు. అంత‌గా దిగ‌జారి ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని, ప‌దేళ్ల‌లో ఆ పార్టీ చేసిన బాగోతాలే కాదు.. ఇప్పుటికీ న‌డుస్తున్న తీరు.. అవంభిస్తున్న విధానాల‌నూ ఆమె ఎండ‌గ‌ట్టారు. ప్ర‌ధానంగా ఇవాళ ఆమె మాట్లాడిన దాంట్లో ప‌ది ఆరోప‌ణ‌ల అస్త్రాల‌ను బీఆరెస్‌పై సంధించారు.

Advertisement

1. 1400 కోట్లు ఇప్పుడు బీఆరెస్ ఖాతాలో ఉన్నాయి. ఇవి ఎక్క‌డివో చెబుతారా? ఆంధ్రా కాంట్రాక్ట‌ర్ల నుంచి క్విడ్ ప్రో కో ద్వారా వ‌చ్చిన‌వి కావా? అప్ప‌నంగా,, అవినీతిమ‌యంగా వ‌చ్చిన ఈ సొమ్మును అమ‌రుల కుటుంబాల‌కు ఒక్కో కోటి చొప్పున పంచండి.

2. పదేళ్లు అధికారంలో ఉన్న స‌మ‌యంలో సంపాదించిన సొమ్ముతో ఇప్ప‌టికీ కేటీఆర్ త‌న టూర్ల‌ను హెలికాప్ట‌ర్ల ద్వారా నిర్వ‌హిస్తున్నాడు. తెలంగాణ‌లో దూర ప్రాంతాల‌కు వెళ్లాలంటే ఆయ‌న‌కు హెలికాప్ట‌ర్ ఉంటుంది. ధ‌న‌బ‌లం చూపించుకుంటే జ‌నామోదం దొర‌కుతుందా?

3. ఫీనిక్స్ సంస్థ‌కు వేలాది కోట్లు దోచిపెట్టింది కేటీఆర్ కాదా? బీఆరెస్ పార్టీ కాదా? సిటీ న‌డిబొడ్డున ఉన్న 33 ల‌క్ష‌ల ట‌న్నుల క‌ల‌ప‌ను న‌రికివేసి గ్రీన‌రీ లేకుండా చేసింది వాస్త‌వం కాదా? అట‌వీ శాఖ దీనిపై 10 కేసులు పెట్టింది? ఇప్పుడు ఎందుకు సైలెంట్‌గా ఉంది. అప్పుడు బీఆరెస్‌, ఇప్పుడు కాంగ్రెస్.. రెండూ దీనికి తలుపులు బార్లా తెరిచాయి. ఇది వాస్త‌వం కాదా?

4. రూ. 188 కోట్ల‌తో కొత్త‌గా ప‌య‌నీర్ అనే ఇంగ్లీష్ పేప‌ర్‌ను కేటీఆర్ కొనుగోలు చేశాడు. ఇప్ప‌టి దాకా ఇక్క‌డున్న తెలుగు మీడియాతో అబ‌ద్దాలాడించాడు. ఇప్పుడు ఇంగ్లీష్‌లో కూడా త‌ప్పుడు క‌థ‌నాలు, అబ‌ద్ద‌పు వార్త‌లు రాయించేందుకు ఆ పేప‌ర్ అవ‌స‌ర‌మొచ్చిందా? యూట్యూబ్‌లు, సోష‌ల్ మీడియా ద్వారా ఏదో సాధిస్తామ‌నుకంటే పొర‌పాటే.. జ‌నం ఆద‌ర‌ణ ఉండాలె. జ‌న‌బ‌లం ముఖ్యం.. ధ‌న‌బ‌లం కాదు..!

5. త‌న మిత్రుడైన ప్ర‌దీప్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌కు క్విడ్ ప్రో కో ద్వారానే వేల కోట్ల ల‌బ్ది ప్ర‌యోజ‌నం చేకూరేలా కేటీఆర్ అధికార దుర్వినియోగం చేశాడు. దీనిపై వార్త క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి. నిజం చెప్పే ద‌మ్ముందా?

6. అప్ప‌నంగా తెలంగాణ భూముల‌న్నీ అవినీతిమ‌యంగా అన్యాక్రాంతం చేశారు. 2014 నుంచి తాము అధికారంలోకి వ‌చ్చిన నాటి వ‌ర‌కు అన్ని భూముల లెక్క‌లు తీస్తాం. విచార‌ణ జ‌రిపిస్తాం… ప్ర‌భుత్వ భూములు, ప్ర‌జ‌ల భూములు.. ధార్మిక భూములు అన్నీ లెక్క‌లు బ‌య‌ట‌కు వ‌స్తాయి. ఎవ‌రినీ వ‌దిలేది లేదు!

7. మేము ఉద్య‌మకారుల త‌రుపున ఉద్య‌మాలు చేస్తుంటే.. ఆ వార్త క‌థ‌నాలు క‌వ‌రేజీ కాకుండా పేప‌ర్ల‌కు ఫోన్లు చేసి మ‌రీ చెబుతున్నాడు హ‌రీశ్‌రావు. మీకు చేత‌కాదు. చేయ‌లేదు. మేం చేస్తే మీకెందుకంత క‌డుపుమంట‌..? సింగ‌రేణిలో బాయిబాట కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌గానే మీరెందుకు వ‌ణుకుతున్నారు. ఇక్క‌డ ఆంధ్రా కాంట్రాక్ల‌ర్ల‌కు వ‌త్తాసు ప‌లికింది హ‌రీశ్‌రావు కాదా? ఇది అంద‌రికీ తెలిసిన స‌త్యం.

8. టీఆరెస్ పార్టీ పెట్టుకుంటే మీకు భ‌య‌మెందుకు? ఇన్ని ఆటంకాలు సృష్టించ‌డ‌మెందుకు? మా పార్టీపైన వెయ్యి అభ్యంత‌రాలా? ఇంత‌గా వ‌ణికిపోతున్నారెందుకు? మీకు ప్ర‌జ‌ల వ‌ద్ద ఆద‌ర‌ణ లేద‌ని భ‌య‌ప‌డుతున్నారా? మీరెన్ని చేసినా న్యాయం నా వైపే ఉంది. ఆ పార్టీ పేరు నాదే. టీఆరెస్ నాకే ఉంటుంది. ఇది తెలంగాణ ఇంటి పార్టీగా ఉంటుంది.

9. నారాయ‌ణ‌, చైత‌న్య లాంటి ఆంధ్ర కార్పొరేట్ విద్యా సంస్థ‌ల‌కు పాలు స‌ప్లై చేసి హ‌రీశ్‌రావు కోట్లు గ‌డిస్తున్నాడు. ఈ విద్యాసంస్థ‌ల‌ను త‌న నిజామాబాద్‌లోకే నేను రానీయ‌లేదు. ఇప్పుడు అంతా ఆగం చేశారు. దోచుకుంటున్నారు. తెలంగాణ‌లోని చిన్న కాంట్రాక్ట‌ర్లు, విద్యాసంస్థ‌లు తెలంగాణ ఉద్య‌మానికి ఊతంలా ప‌ని చేశారు. వారిని ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు ఈ పాల వ్యాపారం చేసుకుంటున్నారు. వెంట‌నే విద్యాసంస్థ‌ల‌కు విజ‌య డైరీ పాలను ప్ర‌భుత్వం స‌ప్లై చేయాలి. మ‌ళ్లీ ఓ మూడు నెల‌లు మంత్రి ప‌ద‌వి కావాల‌ట‌…? ఏం దోచుకున్న‌ది చాల‌లేదా?

10. మేం గెలిచినా, ఓడినా జ‌నాల్లోనే ఉంటాం. అహంకారం ప్ర‌ద‌ర్శించం. ఇంట్లోనే పండుకోం. అధికారం కోసం వెంప‌ర్లాడం. జ‌నం మ‌ధ్య‌నే ఉంటాం. పోరాడుతూనే ఉంటాం.. !

Related News

రావ‌ణ్‌తో మూడు ముక్క‌లాట‌! మా పార్టీ కాదంటే మా పార్టీ కాదు..! టీడీపీకి పావుగా.. ప‌వ‌న్ టార్గెట్‌గా..

వారం రోజుల సీఎం! మూడు నెల‌ల మంత్రి….! క‌త్తి చేతిలో ఉంటేనే యుద్ధ‌మ‌న్న‌ట్టు…

విద్యాశాఖ మంత్రిగా కోదండరామ్! రేవంత్ విసిరిన ఉద్య‌మ‌కారుల అస్త్రాన్ని తిప్పి కొట్టిన బీఆరెఎస్‌!

ముచ్చ‌ట‌గా మూడు టీఆరెస్ పార్టీలు! క‌విత టీఆరెస్‌పై వెయ్యి అభ్యంత‌రాలు..! ఈసీ ముందు పంచాయితీ!

ఎంత కొట్టినా చావ‌ని పామురా వాడు! రావ‌ణ్‌ను ఎంత బ్లేమ్ చేద్దామ‌నుకున్నా.. మైలేజే వ‌స్తుంది..?

సోనియాను మోసం చేసిన‌ రెండు తెలుగు రాష్ట్రాలు! ఆమె సిద్దాంతాలు ..రాజ‌కీయాలను చూడ‌లేదు..!

తిట్ట‌పోరా కేసీఆర్‌..! కాళేశ్వ‌రం క‌ట్ట‌పోరా కేసీఆర్‌..! చ‌ర్చ‌కు వ‌స్త‌వారా కేసీఆర్‌..! నీ మ‌ర్యాద‌ను కాపాడుతాం.. ఒట్టు!

Big Stories

Advertisement
×