Illu Illalu Pillalu ToIlluday Episode july 26th: నిన్నటి ఎపిసోడ్ లో.. రామారాజు వెళ్తుంటే మాయగారండి మీరు ఒక నిమిషం ఆగితే నేను కొన్ని విషయాలు చెప్పాలండి.. అది కూడా మీ ముందర అని అంటుంది. సరే చెప్పమ్మా ఏంటో అని రామరాజు అంటాడు.. వేదవతి కూడా మౌనంగా ఉండిపోతుంది. శ్రీవల్లి ఇంట్లోని వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ రూల్స్ పాటించాలి అప్పుడే ఎవరి దగ్గర మాట పడాల్సిన అవసరం లేదు అని కండిషన్స్ పెడుతుంది. అయితే ఆ కండిషన్స్ విన్న అందరూ షాక్ అవుతారు. రామరాజు కూడా మౌనంగా ఉండడంతో శ్రీవల్లి రెచ్చిపోతుంది.. ఇంట్లో రాజ్యం నాదే అని శ్రీవల్లి సంబరపడిపోతూ ఉంటుంది. ప్రేమ నర్మదా ఇద్దరూ శ్రీవల్లి పెట్టే టార్చర్ ఎక్కువగా ఉంది. ఓవరాక్షన్ భరించలేకపోతున్నామని అంటారు. అంతా మావయ్య గారికి జరిగిన అవమానం వల్లే శ్రీవల్లి వెళ్ళిపోవాలనుకునింది అని అనుకున్నారు. అయితే గొడవ జరిగిన తర్వాత శ్రీవల్లి వాళ్ళ పుట్టింటికి వెళ్లి వచ్చింది ఇదంతా వాళ్ళ అమ్మ ప్లాన్ లాగే ఉంది. ఈ ప్లాన్ వెనకాల ఉన్న ఏదైనా ఉందేమో.. మన కుటుంబాన్ని ఏదైనా చేయాలని అనుకుంటున్నారేమో.. మన ఇంటిని కాపాడుకోవాల్సిన అవసరం మన మీదే ఉంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నర్మద మాత్రం సాగర్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఒంటరిగా వస్తూ ఉంటుంది. ఎదురుగా సాగర్ రావడం చూసి సంతోషపడుతుంది. సాగర్ మాత్రం చూసి చూడనట్టు పక్కన ఉన్న షాప్ కి వెళ్తాడు. మా నాన్న బియ్యం ఇచ్చారంట కదా దానికి డబ్బులు తీసుకురామన్నారు అని అంటాడు. నర్మద ను పట్టించుకోకుండా అక్కడినుంచి సాగర్ వెళ్లిపోతాడు. నర్మద పిలుస్తున్న కూడా సాగరు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెనక్కి తిరిగి చూడగానే భాగ్యం కనిపిస్తుంది. నర్మదను భాగ్యం పిలుస్తుంది. నీకు ఎంత కష్టమొచ్చింది అమ్మాయి.. నీ పరిస్థితిని చూస్తుంటే నాకు గుండె తరుక్కుపోతుంది. కట్టుకున్న భార్య పిలుస్తున్న కూడా మీ భర్త పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు అంటూ భాగ్యం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది.
ఇది ఎంత అవమానం ఇంత అవమానం జరిగిన తర్వాత సిగ్గు శరం ఉన్న ఏ ఆడదైనా భరించలేక చచ్చిపోతారు అని భాగ్యం అంటుంది. కావాలనే భాగ్యము నర్మదను రెచ్చగొడుతుంది. నీకు కన్న తల్లి లాగా చెప్తున్నాను నువ్వు ఇక మీద నుంచి నోరు మూసుకొని ఉండాలి అని అంటుంది.. ఒకవైపు భాగ్యం రెచ్చగొడుతున్న సరే నర్మద మాత్రం సైలెంట్ గా ఉంటుంది. వెళ్ళిపోతుంటే ఏంటమ్మా ఇంకా చిటికెరేసి పిలవలేదు చిటికెలు వెయ్యి చిటికెలు వెయ్యి అని అంటుంది.. ఇంకొకసారి నాతో పెట్టుకోవాలని ఆలోచించకు అడ్రస్ లేకుండా పోతావ్ అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది.
శ్రీవల్లి ఇంట్లో ఇంత సైలెంట్ గా ఉంటే ఆ నర్మదా ప్రేమలో రెచ్చిపోతారు. వాళ్లకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అనుకుంటుంది. టైం 10 అవుతుంది కదా ఖచ్చితంగా అందరూ లోపలికి వెళ్ళాలి అని రూల్ పెట్టేస్తుంది. ముందుగా చందు దగ్గరికి వెళ్లి టైం పది అయింది కదా వెళ్ళు ఇంకా లాప్టాప్ లో ఆటలు ఏంటి అని అడుగుతుంది. చందు ఆటలు కాదు వల్లి కాస్త వర్క్ ఉంది చేస్తున్నాను అని అంటాడు. అయినా పొద్దున్నే నువ్వు మళ్ళీ ఆఫీస్ కి వెళ్ళాలి కదా.. అందుకే వెళ్లి పడుకో బావ అనేసి అంటుంది.
ఆ తర్వాత తిరుపతి, అమూల్యా ఇద్దరు టీవీ చూస్తూ ఉంటారు. టైం పది అవుతుంది ఇంకా టీవీ చూడాలా అని అడుగుతుంది. టీవీ చూడకుండా ఎలా ఉండాలి కాసేపు ఆగితే సినిమా అయిపోతుంది వదిన అని అమూల్య అడుగుతుంది. కానీ శ్రీవల్లి మాత్రం రామరాజుకి ఇదే విషయాన్ని చెప్పి ఆ తర్వాత ఇక్కడే కూర్చోండి అని అంటుంది. ఆ మాట వినగానే తిరుపతి అక్కడి నుంచి మాయం అయిపోతాడు. అమూల్య ఇంకా ఏంటి పొద్దున్నే కాలేజీకి వెళ్ళావా నువ్వు రా లోపలికి వెళ్లి పడుకో అనేసి అంటాడు.
Also Read :ప్రణతికి షాకివ్వబోతున్న పార్వతి.. అవనిని కాపాడిన అక్షయ్.. మరో ట్విస్ట్..
అయితే ప్రేమ తిరుగుతూ ఉండడం చూసిన శ్రీవల్లి ఏంటి ప్రేమ నీకు బొట్టు కాటుక పెట్టి చెప్పాలా… టైం పది అవుతుంది లోపలికి రావా అని అంటుంది. ధీరజ్ ఇంకా రాలేదు అక్క వెయిట్ చేస్తున్నానని అంటుంది. నేను ఉదయం చెప్పలేదా మర్చిపోయావా పదిగళ్ల ఇంట్లో అందరూ ఉండాలి అని.. ధీరజ్ వస్తే బయట ఉంటాడులే నువ్వు లోపలికి రా అని అడుగుతుంది. ధీరజ్ వచ్చిన తర్వాత తలుపు వేస్తాంలేని ప్రేమ. అదే మాట మావయ్యకి చెప్పు అని ప్రేమతో అంటుంది శ్రీవల్లి. కానీ ధీరజ్ మాత్రం రాలేదు . నువ్వు ఎలా తలపిస్తావో నేను చూస్తాను అని అంటుంది ప్రేమ. ప్రేమను బయటకు గేంటేసి శ్రీవల్లి తలిపెస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..