Commercial LPG cylinder rates hiked: గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. ప్రతినెలా మొదటి తేదీన ఎల్పీజడీ ధరల్లో మార్పులు చేస్తున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరోసారి రేట్లను పెంచేశాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను ఏకంగా రూ.50 వరకు పెంచారు. దీంతో దసరా, దీపావళి పండుగలకు ముందే గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ ధరలు నేటినుంచి అమల్లోకి రానున్నాయి. పండగ వేళ సామాన్యుడిపై భారం పడనుంది.
అయితే, 14.2కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,967 ఉండగా.. డొమెస్టిక్ ధర రూ.855 గా ఉంది.
ఢిల్లీలో 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,740కి చేరింది. అంతకుముందు రూ.1691.50గా ఉండేది. అలాగే కోల్ కతాలో 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1850.50కి చేరగా.. సెప్టెంబర్ లో రూ.1802.50గా ఉండేది. ఇక, ముంబైలో 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూరూ.1692 కు చేరగా.. గత నెలలో రూ.1644గా, చెన్నైలో 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ రూ.1903 ఉండగా.. గతంలో రూ.1855గా ఉండేవి.
Also Read: అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఎనిమిది మంది దుర్మరణం
అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు పెంచడంతో రెస్టారెంట్లు, హోటళ్లు, దాబా, ఇతర ఫుడ్ కోర్టులలో ఆహారానికి సంబంధించిన ధరలు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ విషయంపై ఎలాంటి సమాచారం లేదు. ఎల్పీజీ ధరలు పెరగడంతో ఇతర ధరలు కూడా పెంచే అవకాశం ఉందని సమాచారం.
ఇదిలా ఉండగా, గత మూడు నెలలుగా ఎల్పీజీ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతకుముందు ఆగస్టు, సెప్టెంబర్‌లో కూడా ధరలు పెంచారు. ఆగస్టులో రూ.8 నుంచి 9 వరకు పెంచగా.. సెప్టెంబర్ నెలలో రూ.39 పెంచారు. తాజాగా, అక్టోబర్‌లో రూ.48.50 వరకు పెంచేశారు.