BigTV English

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుకు 2019లో తొలి డ్యామేజ్ గుర్తింపు.. ఎల్ అండ్ టీ కీలక విషయాలు వెల్లడి

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుకు 2019లో తొలి డ్యామేజ్ గుర్తింపు.. ఎల్ అండ్ టీ కీలక విషయాలు వెల్లడి

Kaleshwaram Project: కాళేశ్వరం కమిషన్ ముందు L &T సంస్థ ప్రతినిధుల విచారణ ముగిసింది. ముగ్గురు ప్రతినిధులను కమిషన్ విచారించింది. నిర్మాణం, నాణ్యత, బ్లాక్ 7 కుంగుబాటుపై కమిషన్ వరుస ప్రశ్నలు సంధించిది. నిర్మాణంలో నాణ్యత పాటించారా..? అని కమిషన్ ప్రశ్నించగా.. క్వాలిటీ కంట్రోల్ వంద శాతం పాటించామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. నిర్మాణంలో నాణ్యత పాటిస్తే బ్లాక్ 7 ఎలా కుంగింది, కుంగడానికి కారణాలు ఏంటని కమిషన్‌ ప్రశ్నించగా.. డిజైన్స్ అండ్ డ్రాయింగ్‌లో లోపాలు ఉన్నాయని.. వాటితో పాటు ఎక్కువ వరదలు, బ్యారేజ్ వద్ద నీటిని నిల్వ చేయడం వల్ల 7 బ్లాక్ కుంగిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.


మేడిగడ్డ బ్యారేజీ మొట్టమొదటి డ్యామేజ్ ఎప్పుడు జరిగిందని కమిషన్ ప్రశ్నించగా.. 2019లో మొదటిసారి డ్యామేజీ గుర్తించామని.. వెంటనే సమస్య పరిష్కరిస్తే ఇంతటి డ్యామేజ్ అయ్యేది కాదని వివరణ ఇచ్చారు. సబ్ కాంట్రాక్టర్లకు ఏమైనా ఇచ్చారా..? అని ప్రశ్నించగా.. ఇతర రాష్ట్రాల నుంచి లేబర్‌ సహాయం తీసుకున్నామని.. సబ్ కాంట్రాక్టర్లకు ఇవ్వలేదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రాజెక్ట్ కుంగడానికి గల కారణాలపై మేము కూడా రీసెర్చ్ చేశామని.. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాని L &T సంస్థ ప్రతినిధులు తెలిపారు. కాపర్ డ్యాం కాంట్రాక్ట్ పరిధిలోకి వస్తుందా?

Also Read: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్‌కు ప్రమాదం.. వరుసగా 6 కాన్వాయ్‌లు..


అడిషనల్ వర్క్ కిందకి వస్తుందా? అని కమిషన్ ప్రశ్నించగా.. కాంట్రాక్ట్ కిందికే వస్తుంది కానీ.. కాపర్ డ్యామ్‌ నిధులు ఇప్పటికీ విడుదల చేయలేదని L &T సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ ప్రకారమే కన్స్ట్రక్షన్ జరిగిందని.. మేడిగడ్డ నిర్మాణం పూర్తి అయినట్లు ఇంజనీర్లు కంప్లిషన్ రిపోర్ట్‌ ఇచ్చారని తెలిపారు. కుంగిన బ్లాక్ లు తిరిగి నిర్మించుకోవచ్చా అన్న ప్రశ్నకు.. L & T ప్రతినిధులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×