Unnamed Railway Station In India: దేశ వ్యాప్తంగా 7301 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటిలో అన్ని రైల్వే స్టేషన్లకు పేర్లు ఉన్నాయి. కానీ, ఇండియాలో ఒకే ఒక్క రైల్వే స్టేషన్ కు పేరు లేదు. ఈ స్టేషన్ నిర్మించిన నాటి నుంచి పేరు లేకుండా తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నది. ఇంతకీ ఈ రైల్వే స్టేషన్ కు పేరు ఎందుకు పెట్టలేదు? దాని వెనుకన్న అసలు కారణాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
పశ్చిమ బెంగాల్ లో పేరు లేని రైల్వే స్టేషన్
ప్రారంభం నుంచి పేరు లేకుండా ఉన్న రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్ లో ఉన్నది. బుర్ద్వాన్ పట్టణానికి దాదాపు 35 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. దీనిని 2008లో నిర్మించారు. అప్పటి నుంచి దీనికి పేరు పెట్లేదు. ఇప్పటికీ పేరు లేని రైల్వే స్టేషన్ గా నే గుర్తింపు తెచ్చుకుంది. రోజూ అక్కడ 6 రైళ్లు ఆగుతాయి. నిత్యం పలురువు ప్రయాణీకులు రాకపోకలు కొనసాగిస్తారు. సరుకు రవాణా కూడా కొనసాగుతుంది.
ఈ రైల్వే స్టేషన్ కు పేరు ఎందుకు పెట్టలేదంటే?
వాస్తవానికి ఈ రైల్వే స్టేషన్ కు పేరు పెట్టకపోవడానికి కారణం ఉంది. ఈ రైల్వే స్టేషన్ బంకురా – మసాగ్రామ్ రైల్వే లైన్ లోని రైనా, రాయ్ నగర్ గ్రామాల మధ్య ఉంటుంది. ఈ స్టేషన్ కు తమ గ్రామం పేరు పెట్టాలంటే, తమ గ్రామం పేరు పెట్టాలని ఇరు గ్రామాల ప్రజలు అప్పట్లో పెద్ద గొడవ చేశారు. కొద్ది రోజుల తర్వాత ఈ రైల్వే స్టేషన్ కు రైనాఘర్ అని పేరు పెట్టారు. కానీ రాయ్ నగర్ ప్రజలు స్టేషన్ పేరు మార్చాలని రైల్వే బోర్డుకు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు ఈ స్టేషన్ కు పేరు పెట్టకుండానే కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. స్థానికులు రైల్వే స్టేషన్ పేరును మార్చాలని కోర్టుకు వెళ్లడం వల్లే ఈ స్టేషన్ కు పేరు పెట్టలేదంటున్నారు రైల్వే స్టేషన్ అధికారులు. కోర్టు క్లియరెన్స్ తర్వాతే పేరు మార్పుపై రైల్వేశాఖ ఆలోచించే అవకాశం ఉందన్నారు.
కొత్త ప్రయాణీకులకు ఇబ్బందులు
ఇక ఈ రైల్వే స్టేషన్ కు పేరు లేకపోవడం వల్ల కొత్త ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. రోజుకు ఇక్కడ 6 రైళ్లు ఆగుతాయి. ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు. ఇక్కడ దిగిన ప్రయాణీకులు స్థానికుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే వాళ్లు వెళ్లాల్సిన చోటుకు బయల్దేరుతున్నారు. అయితే, ఈ స్టేషన్ కు రైల్వే టికెట్లు మాత్రం పాత పేరుతోనే అమ్ముతున్నారు. రైనాఘర్ తో పాటు పక్కనే రాయ్ నగర్ అని రాస్తారు. రెండు ఊర్ల పేర్లు కలిసేలా రైల్వే అధికారులు ఈ పేరు పెట్టారు. మొత్తంగా ఈ రైల్వే స్టేషన్ కు అధికారికంగా ఓ పేరంటూ లేకపోవడం విశేషం.
Read Also: అక్కడ అడుగు పెడితే ప్రాణాలు పోయినట్టే, దేశంలోనే భయంకరమైన ఘోస్ట్ రైల్వే స్టేషన్ గురించి మీకు తెలుసా?