Chittoor Crime: చిత్తూరు జిల్లాలో చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకుడు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ దారుణానికి ఒడిగట్టిన యువకుడికి ఓ పార్టీ అంటూ చెప్పుకుంటున్న కొందరు మద్దతు తెలిపినట్లు, ఆ తర్వాత చిన్నారి తండ్రిని బెదిరించినట్లు తెలుస్తోంది. ఇలా దాడికి యత్నించిన క్రమంలో విషయం తెల్సిన స్థానిక పోలీసులు కూడ ష్.. గప్ చుప్ అంటూ చిన్నారి తండ్రికి సలహా ఇచ్చారట. మొత్తం మీద ఇప్పుడు వెలుగులోకి రావడంతో, ఏపీలో ఈ ఘటన సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే..
స్థానికుల వివరాల మేరకు..
చిత్తూరు జిల్లాకు చెందిన మోహన్ అనే యువకుడి మొబైల్ ఫోన్ ను, అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తీసుకున్నాడు. ఆ వ్యక్తి ఫోన్ చూస్తున్న క్రమంలో ఒక్కసారిగా తన కుమార్తె పట్ల మోహన్ అసభ్యంగా ప్రవర్తించిన ఫోటోలు గమనించాడు. అలా గమనించి సైలెంట్ గా ఇంటికి వెళ్లి చిన్నారిని అడిగాడు ఆ తండ్రి. తనతో మోహన్ ప్రవర్తించిన తీరును ఆచిన్నారి తల్లిదండ్రులకు చెప్పింది. ఇక అంతే ఆ తండ్రి మనోవేదన అంతా ఇంతా కాదు. కన్నీరు కారుస్తూ.. దిక్కుతోచని స్థితిలో పోలీసులకు ఫిర్యాదు చేశాడట. అప్పుడు కొంతమంది చిన్నారి తండ్రిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అలా దాడి జరిగినా స్థానిక పోలీసులు ఏమాత్రం స్పందించలేదన్నది ఆరోపణ.
వెలుగులోకి వచ్చిన అసలు విషయం..
ఈ విషయం వెలుగులోకి రావడంతో, పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం వైద్యశాలకు తరలించారు. ఇంతకు అసలేం జరిగిందనే విషయం తెలియాలంటే పోలీసుల దర్యాప్తు పూర్తి కావాల్సి ఉంది. చిన్నారి పట్ల కేవలం అసభ్యంగా ప్రవర్తించాడా.. లేదా అన్నది కూడ వైద్యుల నిర్ధారణ తర్వాతే వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి మాత్రం స్థానిక పోలీసుల నిర్వాకం మాత్రం పలు విమర్శలకు తావిస్తోంది. జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటేనే, స్థానిక పోలీసులు స్పందించి స్పీడ్ గా కేసు నమోదు చేసినట్లు బాధితుడి బంధువులు తెలుపుతున్నారు.
హోమ్ మంత్రి ఫోన్..
చిత్తూరు జిల్లాలో జరిగిన ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఘటన గురించి పూర్తి విషయాలు తెలుసుకున్న హోమ్ మంత్రి అనిత.. చిన్నారి తల్లి తండ్రులతో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని మంత్రి అనిత సూచించారు. మొత్తం మీద హోమ్ మంత్రి స్పందించడంతో స్థానిక పోలీసులు ఎవరి మీద వేటు పడుతుందోనని ఆందోళనలో ఉన్నారట.