E-Paper
Advertisement

తెలంగాణలో కాంగ్రెస్ భారీ ఆందోళనకు పిలుపు.. ‘చలో రాజ్‌భవన్’ ఎప్పుడంటే?

తెలంగాణలో కాంగ్రెస్ భారీ ఆందోళనకు పిలుపు.. ‘చలో రాజ్‌భవన్’ ఎప్పుడంటే?
Advertisement

Mahesh Kumar Goud: లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని వరుసగా రెండోసారి అరెస్టు చేయడాన్ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) తీవ్రంగా ఖండిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. దేశ ప్రధానమంత్రి తర్వాత అత్యున్నత గౌరవం ఇవ్వాల్సిన ప్రతిపక్ష నాయకుడి పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత బాధాకరమని ఆయన అన్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చేసిన తప్పిదాలను ప్రజల ముందుకు తీసుకువచ్చినందుకే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను రాజకీయంగా ఎదుర్కోలేక కేంద్ర ప్రభుత్వం అరెస్టుల మార్గాన్ని ఎంచుకుందని విమర్శించారు.

రాజకీయంగా ఎదుర్కోలేక..

ఇండియా కూటమి నాయకులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ, వారిని అరెస్టు చేసి అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో విభిన్న అభిప్రాయాలను అణిచివేసేందుకు అరెస్టులను ఆయుధంగా ఉపయోగించడం పిరికితనానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాహుల్ గాంధీని రాజకీయంగా ఎదుర్కోలేక ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఇండియా కూటమి నాయకులు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తోందని అన్నారు.

మోడీ నేతృత్వంలో..

Advertisement

దేశ ప్రజలు బీజేపీ ప్రభుత్వ వైఖరిని గమనిస్తున్నారని, మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి రాజకీయంగా రోజులు దగ్గరపడ్డాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే “చలో రాజ్‌భవన్” నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న అన్ని వర్గాల ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమం నెక్లెస్ రోడ్ నుంచి రాజ్‌భవన్ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Also read: తెలంగాణలో రోడ్డు ప్రమాదాల కట్టడికి జీఓ.. డీజీపీ ఆనంద్ బిగ్ ప్లాన్!

Tags

Related News

గ్లోబల్ సంస్థలకు తెలంగాణలో తిరుగులేని ఆఫర్లు.. ఐటీ శాఖ రోడ్‌మ్యాప్ ఇదే?

తెలంగాణలో రోడ్డు ప్రమాదాల కట్టడికి జీఓ.. డీజీపీ ఆనంద్ బిగ్ ప్లాన్!

పీఎం శ్రీ పాఠశాలల్లో స్పెషల్ ఎడ్యుకేటర్ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా!

దుర్గామాత మండపాల నిర్వాహకులు షాకింగ్ న్యూస్.. రూల్స్ పాటించాల్సిందే?

దసరాకు ఊరెళ్లేవారికి తీపి కబురు.. 7 వేల ప్రత్యేక బస్సులు.. మహిళలకు ఉచితం యథాతథం!

తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపు పై సీపీఐ(ఎం) ఉద్యమ బాట!

యజమాని లేకుండా నకిలీ GPA సృష్టించి కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు.. ఎక్కడంటే?

Big Stories

Advertisement
×